Faria Abdullah: టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే యూత్‌ని తనవైపు తిప్పుకున్న నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టిగా తన కామెడీ టైమింగ్‌తో, సహజ నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా ఆమె పొడవైన కాళ్లు, హైట్, డ్యాన్స్ స్కిల్స్‌తో టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అంచనా వేశారు. అయితే, ఆమెకు అంచనాలకు తగ్గట్టుగా అవకాశాలు రావడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తర్వాత ఫరియాకు కొన్ని చిన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చినా, ఏ ఒక్కటి కూడా ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే స్థాయిలో నిలబడలేదు. హీరోయిన్‌గా నిలబడడానికి కావాల్సిన టాలెంట్, గ్లామర్ ఉన్నా, అగ్ర హీరోల సరసన గానీ, పెద్ద బ్యానర్‌లలో గానీ ఈ పొడుగు కాళ్ల సుందరికి అవకాశాలు రావడం లేదు. ఇదే సమయంలో ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన ఇతర హీరోయిన్స్ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. దీంతో ఫరియా.. కేవలం షోరూమ్ ఓపెనింగ్‌లు, ఇతర ఈవెంట్‌లకే పరిమితం కావాల్సి వస్తోంది.
Also Read- Prasanth Varma: ‘జై హనుమాన్’ డౌటేనా? ప్రశాంత్ వర్మ ఇలా ఇరుక్కున్నాడేంటి?
ఐటెం సాంగ్స్ కూడా కలిసి రాలేదు
మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో, ఐటెం సాంగ్స్ చేసి అయినా ప్రేక్షకుల్లో, దర్శక నిర్మాతల్లో తన పేరును నిలబెట్టుకోవాలని ఫరియా భావించింది. దురదృష్టవశాత్తూ ఆ ప్రయత్నాలు కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చుకుని గ్లామర్ ప్రదర్శనపై దృష్టి సారించింది. ఎలాగైనా సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ఫరియా అబ్దుల్లా ఇటీవల సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. హాట్ హాట్ స్పెషల్ ఫొటోషూట్స్ చేస్తూ, తన అందాలను దాచుకోకుండా ఆరబోస్తోంది. మోడ్రన్, ట్రెండీ అవుట్‌ఫిట్‌లలో తన పొడుగు కాళ్ల అందాన్ని ఎలివేట్ చేస్తూ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మాంచి వైరల్‌గా మారాయి. ఆమె ఫొటోలు షేర్ చేసిన నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ లైకులు, కామెంట్స్‌తో దూసుకుపోతున్నాయి.
Also Read- Mana Shankara Vara Prasad Garu: ఐటమ్ సాంగ్ చేస్తున్నది ఎవరో తెలుసా? ఇందులోనూ అనిల్ మార్కే!
హాట్ ఫొటోషూట్‌లతో కుర్రకారు మతిపోగొడుతున్న చిట్టి
సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూసి కుర్రకారుకు మతిపోతోంది. ఫరియా చేస్తున్న ఈ గ్లామర్ ట్రీట్, యూత్‌ని విపరీతంగా ఆకర్షిస్తోంది. సినీ పరిశ్రమలో అవకాశాలు రావాలంటే కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ కూడా ముఖ్యమని గుర్తించిన ఈ బ్యూటీ, ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ హాట్ ఫొటోషూట్స్‌ను చూసైనా ఏ స్టార్ హీరోనో లేదా అగ్ర దర్శకుడో ఆమెకు బంపర్ ఆఫర్ ఇస్తారేమో చూడాలి. ఒక మంచి సినిమా ఆఫర్ పడితే, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలబడే సత్తా ఫరియాలో పుష్కలంగా ఉందని భావించవచ్చు. కాకపోతే, ఇక్కడ ఆమె హైట్ కూడా ఆమెకు అవకాశాలు రాకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. టాలీవుడ్‌లో ప్రభాస్, వరుణ్ తేజ్ వంటి వారికే ఫరియా పర్ఫెక్ట్‌గా సూటవుతుంది. మిగతా హీరోలు ఆమె హైట్‌ని అందుకోవడం కష్టమే. ఇదే, ఆమెకు మైనస్‌గా మారిందని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
