Gadwal Police (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Gadwal Police: మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకే హత్య!

Gadwal Police: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మహిళా మెడలోని బంగారు గొలుసు దొంగలించాలని నిర్ణయించుకొని మహిళను హత్య చేసి బంగారు పుస్తెలతాడు దొంగిలించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అప్పు అడగగా ఇప్పటికిప్పుడే డబ్బులు లేవని కొద్ది రోజులకు నగదు సమకూర్చి ఇస్తానన్న మహిళను ఓ కిరాతకుడు అత్యంత పాశవీకంగా కిందకి దొబ్బి గొంతు నిలిపి చంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Also ReadGadwal District: గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలుకు కొర్రీలు.. ఆందోళనలో రైతన్నలు

మీడియా సమావేశంలో ఎస్పీ

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన కళ్ల రామిరెడ్డి అనే యువకుడు గద్వాలలోని షెరెల్లి వీధిలో తన పెదనాన్న ఇంట్లో పై పోర్షన్లో వారి తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండేవాడన్నారు. ఇంటి క్రింది భాగంలో హత్యకు గురైన లక్ష్మి (55) కుటుంబం నివాసం ఉండేదన్నారు. కొద్ది రోజులకు నేరస్థుడు మరో ఇంటికి మారి పాత ఇంటి కిరాయి వసూలు చేసి ఆ డబ్బును తన పెద్ద నాన్నకు ఇచ్చేవాడన్నారు అలా అక్కడికి వెళుతున్న క్రమంలో మృతురాలితో పరిచయం ఏర్పడిందన్నారు. నేరస్థుడు తన భార్య దగ్గర కొంత డబ్బును బంగారు, మరికొంత తన మిత్రుల దగ్గర అప్పుచేసి ఆన్ లైన్ గేమ్స్ ఆడి పోగొట్టుకున్నాడన్నారు.

మహిళ ఫైనాన్స్ వ్యాపారం చేయడంతో

మృతి చెందిన లక్ష్మీ అనే మహిళ ఫైనాన్స్ వ్యాపారం చేసేది ఆమె దగ్గర వడ్డీకి తీసుకొని అప్పులను కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఈ నెల రెండున ఉదయం 11 గంటల ప్రాంతంలో స్కూటీపై మహిళ ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా ఆమె ఇప్పుడు డబ్బులు లేవు కొంచెం టైం పడుతుంది నీకు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానని బదులిచ్చిందన్నారు. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని, ఎలాగైనా డబ్బులు ఇవ్వండి అని ఆమెను బలవంతం పెట్టాడు. ఇప్పుడు నా దగ్గర ఏమీ డబ్బులు లేవని మహిళ అనగా మృతురాలి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును చూసి ఎలాగైనా ఆమెను చంపి ఆ గొలుసును దొంగిలించి అమ్మే వాటితోనైనా అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ మేరకు ఆమెను బలంగా వెనకకు నెట్టడంతో వెల్లకిలా పడిపోయిందన్నారు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు తీసుకొని వెళ్ళాడన్నారు.

శంషాబాద్ లోని తన స్నేహితుడి షాపులో బిస్కెట్ గా మార్పు

నిందితుడి చిన్ననాటి మిత్రుడైన ఉమేష్ కు శంషాబాద్ లో గోల్డ్ షాప్ నిర్వహిస్తుండగా అట్టి బంగారు పుస్తెలతాడును తన భార్య నానమ్మది అని చెప్పి దాన్ని కరిగించి ఇవ్వాలని, దానితో తన భార్యకు, కొడుకుకు చైన్ చేయించాలని తన మిత్రుడిని కోరారన్నారు. ఆ మేరకు అతని మాటలను నమ్మి అట్టి బంగారాన్ని కరిగించి ముద్దగా ఇవ్వగా దానిని మరల బిస్కెట్ రూపంలోకి మార్చి హైదరాబాదులోని ఉప్పరగూడలో అమ్మాడన్నారు అందుకు 5 లక్షల 60 వేల రూపాయలు వచ్చాయన్నారు. వాటి డబ్బులు తన ఖర్చులకు కొంతవరకు వాడుకొని భార్యకు ఇయర్ రింగ్స్ చేయించి కొత్త బట్టలు ఇప్పించి మిగిలిన 1.33 లక్షల రూపాయలను తన స్కూటీలో ఉంచుకున్నాడు అన్నారు. తన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసిన లక్ష ఇరవై వేల రూపాయలను అప్పు కట్టి, తన భార్య బంగారాన్ని తాకట్టు పెట్టగా దానిని విడిపించేందుకు 1.65 లక్షలు కట్టి విడిపించుకున్నారన్నారు.

ఫోన్లో సంభాషించారనే దానిపై ప్రత్యేక దృష్టి

మృతురాలి భర్త మల్లికార్జున్ ఫిర్యాదుతో కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు డిఎస్పి మోగులయ్య సిఐ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మృతురాలు ఇంటికి వచ్చే వారి వివరాలను సేకరించారు. మృత్యురాలు ఎవరెవరికి డబ్బులు వడ్డీలకు ఇచ్చేది ఎవరెవరు ఎక్కువగా ఫోన్లో సంభాషించారనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిపై నిఘా పెట్టి విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నాడన్నారు. నగదును ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

Also Read: Gadwal District: ఆ జిల్లాలో జోరుగా అక్రమ దందా.. స్కానింగ్ సెంటర్లలో ఇష్టారాజ్యం.. తనిఖీలు చేపట్టని అధికారులు

Just In

01

12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..

Delhi Blast: కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా?

Sanitation Crisis: దుర్గంధంలో గ్రామ పంచాయతీలు.. ఆగిపోయిన పారిశుద్య పనులు

Islamabad Blast: ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు.. 12 మంది మృతి, 20 మందికి గాయాలు

Prabhas: ప్రభాస్‌కు ఎందుకు అంత క్రేజ్.. పాన్ ఇండియా స్టార్‌ అవ్వడానికి రీజన్ ఇదే..