Nitin Gadkari (imagecredit:twitter)
జాతీయం

Nitin Gadkari: వేమూరి కావేరి బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Nitin Gadkari: ఈమధ్య వేమూరి కావేరి బస్సు(Vemuri Kaveri Bus) ప్రమాదంలో పదుల సంఖ్యలో జనం చనిపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది. స్లీపర్ బస్సుల నిర్వహణ, నిబంధనలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్‍(Sleeper)‌గా మారిస్తే నేరుగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కోడ్‍లో స్పష్టమైన నిబంధనలు చేర్చామని తెలిపారు.

Also Read: VC Sajjanar: వాట్సప్‌లో సజ్జనార్ అప్‌డేట్స్.. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు

అనేక కఠిన నిబంధనలు..

వేమూరి కావేరి ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదంపై స్పందిస్తూ, చట్ట విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సు అసలు రిజిస్ట్రేషన్ సీటర్ కోచ్‍గా ఉంటే దానిని స్లీపర్ కోచ్‍గా మార్చారని ఈ ఘటనపై విచారణ జరుగుతున్నదని చెప్పారు. 2025 సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చిన సవరించిన బస్ కోడ్‍లో అనేక కఠిన నిబంధనలు ఉన్నాయని వివరించారు. ఆ కోడ్ ప్రకారం తయారైన బస్సులు అగ్ని ప్రమాదాలకు గురికావని చెప్పారు. దేశంలోని అన్ని బస్సులు ఈ కొత్త బస్ కోడ్‍కు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

Also Read: Congress vs BJP: అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్

Just In

01

Mega concert 2025: ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. పెద్ది సాంగ్ వచ్చేది అప్పుడేనా?..

Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల.. డిప్యూటీ సీఎం ఆదేశం

EAD Policy: భారతీయులను ఇబ్బందిపెట్టేలా ట్రంప్ మరో నిర్ణయం.. అమెరికాలో ఉన్న మనోళ్ల ఉద్యోగాలకు ముప్పు!

Viral Video: సెలైన్ బాటిల్‌తో వీధుల్లో తిరిగిన రోగి.. అంత అర్జంట్ పని ఏంటో? ఇదిగో వీడియో

Yadadri Bhuvanagiri: అధికార పార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యం.. ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్న వైనం!