Diwali 2025 (Image Source: twitter)
అంతర్జాతీయం

Diwali 2025: దీపావళిపై కాలిఫోర్నియా సంచలన నిర్ణయం.. గాల్లో తేలిపోతున్న భారతీయులు!

Diwali 2025: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం.. దీపావళిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న సాంస్కృతిక వైవిధ్యం, భారతీయ అమెరికన్ల వారసత్వాన్ని గౌరవించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ సెలవును చట్టబద్దం చేసేలా శాసనసభలో బిల్లును సైతం ఆమోదించడం విశేషం.

దీపావళిలో స్పెషల్ బిల్
దీపావళికి సెలవును డిక్లేర్ చేస్తూ.. కాలిఫోర్నియా రాష్ట్ర శాసనసభ ‘AB 268’ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం దీపావళి ఇప్పుడు రాష్ట్ర పండుగగా అధికారిక గుర్తింపు పొందింది. ఈ చర్య సాంస్కృతిక అవగాహన, అంగీకారాన్ని పెంపొందించడంతో పాటు, రాష్ట్ర ఉద్యోగులు తమ కుటుంబాలు, సమాజంతో కలిసి పండుగ జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పెరుగుతోన్న ఆదరణ
హిందువులు, సిక్కులు, జైనులు ప్రధానంగా జరుపుకునే దీపావళి పండుగకు.. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. దీపావళిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ద్వారా కాలిఫోర్నియా రాష్ట్రం సాంస్కృతిక వైవిధ్యం పట్ల తన అంకితభావాన్ని చూపించిందని అక్కడి ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపావళిని రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించడంతో గాల్లో తేలిపోతున్నారు.

ఉద్యోగులపై ప్రభావం
కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఇప్పుడు దీపావళి రోజు అధికారిక సెలవు తీసుకుని తమ కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవచ్చు. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచి, సమగ్రత భావనను కలిగించే అవకాశం ఉంది. దీపావళిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ద్వారా సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించే క్రమంలో కాలిఫోర్నియా పెద్ద ముందడుగు వేసిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం.. తమ వివిధ సమాజాల సంప్రదాయాలు, సంస్కృతులను గుర్తించి గౌరవిస్తోందని చెప్పేందుకు చక్కటి ఉదాహరణ అని పేర్కొంటున్నారు.

ఈ అమెరికన్ రాష్ట్రాల్లోనూ సెలవే
కాలిఫోర్నియా తరహాలోనే గతంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు సైతం దీపావళిని సెలవు దినంగా ప్రకటించాయి. పెన్సిల్వేనియా (Pennsylvania), న్యూయార్క్ (New York), న్యూ జెర్సీ (New Jersey), టెక్సాస్ (Texas) రాష్ట్రాలు దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ సెలవును అనౌన్స్ చేశాయి. అలాగే ఫిజి, సింగపూర్, మారిషస్, శ్రీలంక, నేపాల్, మలేషియా, పాకిస్థాన్ వంటి దేశాల్లోనూ దీపావళిని హాలేడీగా ప్రకటించారు.

Also Read: North Korea – Kim: ఓరి దేవుడా.. సినిమాలు షేర్ చేశారని చంపేశాడు.. తెరపైకి కిమ్ నయా ఆగడాలు!

దీపావళి ఎలా వచ్చింది?
హిందువుల అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి పండుగ వచ్చింది. సాధారణగా దీపావళిని వెలుగల పండుగ అని కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీనిని హిందువులు జరుపుకుంటారు. దీపావళి పండుగ.. హిందూ పురాణాల్లో విశేషంగా చెప్పబడింది. నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన నేపథ్యంలో ఈ పండుగను జరుపుకుంటారని చాలా మంది విశ్వాసం. అలాగే రాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భంగాను దీపావళి జరుపుకుంటారని కొందరు నమ్ముతుంటారు.

Also Read: Donald Trump: తల నరికి భారతీయుడి హత్య.. ట్రంప్ రియాక్షన్ చూశారా.. అస్సలు ఊహించలేరు!

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?