Sigachi Industry: పాశమైలారం సిగాచి పరిశ్రమ(Cigar industry)లో అగ్ని ప్రమాదం సంభవించి 30 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులు మాజీ జెడ్పిటిసి గడీల శ్రీకాంత్ గౌడ్(Srikanth Goud), కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్(Corporator Mettu Kumar Yadav) ల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాశమైలారం పరిశ్రామిక వాడలో అత్యంత విషాదం ఈ దుర్ఘటన అని తెలిపారు. ఒక అగ్ని ప్రమాదంలో 54 మంది మరణించడం పెద్ద సంఘటన అని తెలిపారు. బీఆర్ఎస్(BRS) పార్టీ తరపున మరణించిన కార్మికులు పరిశ్రమ స్టాప్ కు నివాళులర్పిస్తున్నానని వారి ఆత్మకు శాంతి చేకూరాలని తామంతా ప్రార్థిస్తున్నామని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి.
Also Read: Jupally Krishnarao: హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బెటర్
నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇస్తామన్నా కోటి రూపాయలు పరిశ్రమ కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇవ్వకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR) ల స్ఫూర్తితో పోరాడుతున్నామని, అన్యాయానికి గురవుతున్న బాధిత కుటుంబాలకు అండగా నిలిచి నష్టపరిహారం చెల్లించేలా పోరాడతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బిఆర్ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్, మాణిక్ యాదవ్, రామకృష్ణ ముదిరాజ్, మొబైల్ అసోసియేషన్ సభ్యులు నరేందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Seethakka: సమిష్టి కృషితో అభివృద్ధిలో జిల్లా నిలుపుదాం: మంత్రి సీతక్క