Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో కాంగ్రెస్ (Telangana Congress) విజయం సాధిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Minister Mohammad Azharuddin) అన్నారు. తనకు కేటాయించిన శాఖ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో దానిపైనా అజారుద్దీన్ స్పందించారు. తనకు ఇచ్చిన శాఖల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు ఏ శాఖ ఇవ్వాలన్న అంశం తన చేతిలో లేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనను నమ్మి మంత్రిని చేశారని.. తన పదవికి పూర్తి న్యాయం చేస్తానని అన్నారు.
‘నా శాఖలో సమస్యలు ఉన్నాయ్’
మైనారిటీ సంక్షేమ శాఖలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి అజారుద్దీన్ తెలియజేశారు. వాటిని పరిష్కరించే విధంగా ముందుకు అడుగు వేస్తానని హామీ ఇచ్చారు. ’10 ఏళ్లుగా ముస్లిం విద్యార్థులకు స్కాలర్ షిప్ రాలేదు. 100% వచ్చే విధంగా కృషి చేస్తాను. హైదరాబాద్ క్రికెట్ (Hyderabad Cricket) కోసం నేను చాలా కృషి చేశాను. నా పైన వేలు చూపించి మాట్లాడటం కరెక్ట్ కాదు. జూబ్లీహిల్స్ లో 100% స్ట్రైక్ రేట్ తో గెలుస్తాం. జూబ్లీహిల్స్ కు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు’ అని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.
‘నవీన్ యాదవ్‌ను గెలిపించండి’
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. అయితే ప్రచారంలో ఆ రెండు పార్టీలు వెనుకబడిపోయినట్లు చెప్పారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లందరూ నవీన్ యాదవ్ (Naveen Yadav)ను భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని అజారుద్దీన్ కోరారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి దేశం పరువు తీశారంటూ తనపై చేస్తున్న ఆరోపణలను అజారుద్దీన్ కొట్టిపారేశారు. దానిపై స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నేను ఎన్ని మ్యాచ్‌లు ఆడాను. ఎన్ని రన్స్, సెంచరీలు చేశాను అనేది ఇంటర్నెట్ ను అడిగితే తెలుస్తుంది’ అని అజారుద్దీన్ చెప్పారు.
Also Read: Rahul Gandhi – H Files: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ.. ప్రతీ 8 మందికి ఒక నకిలీ ఓటర్.. హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్
షబ్బీర్ అలీ ఫైర్
జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓటును అడుగుతున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) ఫైర్ అయ్యారు. గత పదేళ్ల పాలనలో ముస్లిం సోదరులకు కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం నిలబడుతుంటే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని అన్నారు. ‘తెలంగాణ లో పలు మైనారిటీ విద్యాసంస్థలు ను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. బిఆర్ఎస్ పార్టీ ముస్లింలు కోసం ఏమి చేశారో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హిందు ముస్లింలు అనే భేదం చూపించడం లేదు. ఉర్దూ టీచర్లు పోస్టులు ఇచ్చింది కూడా కాంగ్రెస్ నే. 12.58 % మంది ముస్లింలు తెలంగాణ లో ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ద్వారానే అందరికీ తెలిసింది’ అని షబ్బీర్ అలీ అన్నారు.
