AICC ( image credit: twitter)
Politics, లేటెస్ట్ న్యూస్

AICC: జూబ్లీహిల్స్‌పై ఏఐసీసీ ఫోకస్.. చివరి వారం ప్రచారంపై ప్రత్యేక వ్యూహం!

AICC:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఏఐసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గంలో ప్రచార శైలి, పబ్లిక్ పల్స్‌ను పరిశీలిస్తున్నది. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి స్ట్రాటజీలను రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తున్నది. పోలింగ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ పరిస్థితులపై సీక్రెట్ మానిటరింగ్ చేస్తున్నది. ఇప్పటికే సీఎం నుంచి మంత్రుల వరకు ప్రత్యేకమైన అంశాలను టచ్ చేస్తూ ప్రత్యర్థులపై విమర్శల బాణాలను వదులుతున్నారు. ఇవి అభ్యర్థికి మైలేజ్ చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. అలాగే, పలు సర్వేలు నిర్వహిస్తున్న ఏఐసీసీకి అంతా పాజిటివ్ రెస్పాన్స్‌ అందుతున్నది. ఈ నేపథ్యంలో చివరి వారం కీలకం కాబట్టి పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అందుకే మంత్రులు, చైర్మన్లు, ముఖ్య కార్యకర్తలు, పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్లంతా ప్రచారం నిర్వహిస్తూనే, ఓటర్లను ప్రభావితం చేసేలా ఇంటర్నల్‌గా చర్చలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Also ReadAICC: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా? ఇన్‌ఛార్జ్ మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ!

3 లక్షల ఓటర్లే టార్గెట్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా సుమారు లక్ష మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఎన్నికల ప్రచారం చివరి వారంలో ఆ లక్ష మంది ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించాలని టీపీసీసీ ఆదేశాలిచ్చింది. దీంతో పాటు నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ మహిళలను ప్రభుత్వం వైపు ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఉమెన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు టీమ్ లీడర్‌తో కలిపి 70 మంది ముఖ్య నేతలు ఆ మహిళా ఓటర్లను ఆశ్రయించనున్నారు. ప్రతీ గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించనున్నారు. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్య సమావేశంలోనూ ప్రతీ గడప టచ్ అయ్యేలా ఈ వారం రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏఐసీసీ వ్యూహాలు, రాష్ట్ర నాయకుల స్ట్రాటజీలతో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. ఇక, బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను పీజేఆర్ అంశంతో సీఎం బ్రేక్ చేశారని అనుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు స్పష్టమైన అంశాలను టచ్ చేస్తూ, ప్రత్యర్థి పార్టీలను ఊపిరాడకుండా చేస్తూ విజయతీరాలకు చేరాలనేది ప్లాన్.

ఏఐసీసీ ఆదేశాలతోనే..

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏఐసీసీ. రెండేళ్ల ప్రభుత్వ పరిపాలనకు ఇది రెఫరెండంగా భావిస్తున్నారు. దీంతోనే పార్టీ, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఎప్పటికప్పుడు ఏఐసీసీ అంతర్గత నివేదికలు తెప్పించుకుంటున్నది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసి గట్టేందుకు నిరంతరం సర్వేలు నిర్వహిస్తున్నది. లోపాలు ఎక్కడ ఉన్నాయో ఎప్పటికప్పుడు సరి చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తున్నది.

Also Read: AICC Meenakshi Natarajan: నియోజకవర్గాల్లో సమన్వయ సమస్య.. మీనాక్షి నటరాజన్ సీరియస్

Just In

01

Jagadish Reddy: కమీషన్ల కోసమే ఎస్ఎల్బీసీ పనులు.. జగదీశ్వర్ రెడ్డి ఫైర్..!

Purusha first look: ‘పురుషః’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది చూశారా.. ఇదేదో వెరైటీగా ఉందే..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే.. ముస్లింల సపోర్ట్ కాంగ్రెస్‌కే.. మంత్రి అజారుద్దీన్

Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్

MD Ashok Reddy: త్వరలో వాటర్ ఆడిట్.. ప్రతి చుక్క నీటిని లెక్కకడతాం: ఎండీ అశోక్ రెడ్డి