MD Ashok Reddy: హాట్‌ స్పాట్ల‌పై ప్రత్యేక దృష్టి జలమండలి ఆదేశం
MD Ashok Reddy (imagecredit:twitter)
హైదరాబాద్

MD Ashok Reddy: హాట్‌ స్పాట్ల‌పై ప్రత్యేక దృష్టి.. వాటర్ క్వాలిటీ చెక్ చేయాలి జలమండలి ఆదేశం

MD Ashok Reddy: గ్రేటర్ హైదరాబాదులో భారీగా కురుస్తున్న వర్షంతో జలమండలి పరిధిలోని హాట్ స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జలమండలి ఎండి(MD) ఆదేశించారు. వర్షంతో ప్ర‌జ‌లకు ఇబ్బంది లేకుండా అన్ని ర‌కాలుగా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ఈఆర్‌టీ(ERT) బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి(Water Board MD Ashok Reddy), ఈడీ మయాంక్ మిట్టల్ అధికారుల‌ను ఆదేశించారు. వర్షం సహాయక చర్యలపై జలమండలిలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎండీ మాట్లాడుతూ రానున్న 2 రోజుల్లో ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటలవరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.

స‌ర‌ఫ‌రా అయ్యే స‌మ‌యంలో..

ముంపు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు, సివర్ జెట్టింగ్ యంత్రాల ఆపరేషన్లను ఆయా డీజీఎం(DGM)లు తనిఖీ చేయాలన్నారు. వర్షం కారణంగా రహదారులపై ఉన్న మ్యాన్ హోళ్ల వద్ద సీవరేజీ ఓవర్ ఫ్లో పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. అంతేగాక, ప్రజల ఇంటి వద్ద చోక్ అయినా సమస్య పరిష్కరించడానికి ప్రాధాన్యమివ్వాలని జీఎంలను ఆదేశించారు. లోతైన మ్యాన్ హోళ్లు, మురుగు ఉప్పొంగే ప్రాంతాలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు స‌ర‌ఫ‌రా అయ్యే స‌మ‌యంలో మంచినీటి నాణ్య‌త‌ను తప్పకుండా ప‌రీక్షించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Also Read: CPI: తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం

క్లోరిన్ మాత్రల పంపిణీ

ఎక్క‌డా తాగునీరు క‌లుషితం కాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. బ‌స్తీలు, లోతట్టు ప్రాంతాల ప‌ట్ల‌ మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. ఈడీ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు పని జరిగే ప్రదేశాల్లో తప్పనిసరిగా హెల్మెట్లు, గ్లౌజులు, గమ్ బూట్స్ ధరించడంతో పాటు ఇతర రక్షణ చర్యలు పాటించేలా చూడాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రల్ని పంపిణీ చేయాలని సూచించారు. వీటిని క్వాలిటీ వింగ్ జనరల్ మేనేజర్ ఇతర అధికారుల సమన్వయంతో పంపిణీ చేయాలన్నారు. హైడ్రా(Hydraa), జీహెచ్ఎంసీ(GHMC), పోలీసు అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయాలని తెలిపారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూత‌ల‌ను తెర‌వ‌కూడ‌దని సూచించారు. ఇత‌ర వివ‌రాలకు జ‌ల‌మండ‌లి క‌స్ట‌మర్ కేర్ 155313కి కాల్ చేయాల‌ని వారు కోరారు.

Also Read: Damodar Raja Narasimha: ఉస్మానియా, అనుబంధ దవాఖాన్లలో బెటర్ ట్రీట్మెంట్.. ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

Just In

01

Artificial Intelligence: డాక్టర్లు గుర్తించలేకపోయారు.. Grok AI వల్లనే బతికానంటున్న 49 ఏళ్ల వ్యక్తి

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత