CPI (IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

CPI: తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం

CPI:  నైజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తిగా కేంద్ర, రాష్ట్ర నయాదోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్దం కావాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగా పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మధిర పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధులు వాసిరెడ్డి వెంకటపతి స్మారక స్థోపానికి పూలమాలలు వేసి నేతలు అమరవీరులకు నివాళులర్పించారు.

 Also Read: Crime News: విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. చిట్లిపోయిన పుర్రె ఎముక.. ఎక్కడంటే..?

భారత చరిత్రలో అపూర్వమైన అధ్యాయం

అనంతరం ఊట్ల కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్వాతంత్ర్య భారత చరిత్రలో అపూర్వమైన అధ్యాయం అని,జమీందారీ వ్యవస్థ కూల్చివేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన పోరాటయోధుల త్యాగాలు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.ఆ కాలంలో కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో వేలాది మంది రైతులు,కూలీలు,గిరిజనులు చేతిలో తుపాకీ, కొడవళ్ళు,విల్లు,బాణాలు పట్టుకుని జమీందారుల దోపిడీని ఎదిరించారని గుర్తుచేశారు.ఈ పోరాటం వల్లే వేలాది ఎకరాల భూమి పేదలకు పంచబడిందని, పల్లెల్లో గణనీయమైన సామాజిక మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు.

కమ్యూనిస్టులు చేపట్టిన వీరోచిత పోరాటాం

రాచరికానికి, నిర్బంధానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బీజీపీ, ఎంఐఎం పరస్పరం పబ్బంగడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, సాయుధ పోరాటంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో అన్ని వర్గాల వారు ప్రాణత్యాగం చేశారని బిజెపి,ఎంఐఎం గుర్తుంచుకోవాలన్నారు. కమ్యూనిస్టులు చేపట్టిన వీరోచిత పోరాటాలను తట్టుకోలేకనే నైజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన సుదినం సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. సాయుధ పోరాట అమరులు ఆశించిన లక్ష్యాల సాధన దిశగా పోరాటాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు,ఏనుగు గాంధీ,ఏనుగు వెంకటేశ్వరరావు, ఏం ఏ రహీం,సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమాళ్ళపల్లి ప్రకాష్ రావు,మంగళగిరి రామాంజనం,పంగా శేషగిరిరావు,కొండూరు నాగేశ్వరావు,జల్లా బ్రహ్మం, పరుచూరి రాము, అన్నవరపు సత్యనారాయణ ఊట్ల రామకృష్ణ పాల్గొన్నారు.

 Also Read: Train Cancellations: పలు రైళ్లు రద్దు, మరికొన్ని రీషెడ్యూల్.. లిస్ట్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలు కూడా..

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?