Land-Auction (Image source twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Land Auction: ప్రారంభ ధర ఎకరం రూ.99 కోట్లు.. హైదరాబాద్‌లో మరోసారి భూవేలానికి వేళాయె!

Land Auction: కోకాపేట, మూసాపేట భూముల వేలానికి నోటిఫికేషన్

ఈసారి ఎకరం ప్రారంభ ధర రూ.99 కోట్లు
రికార్డు స్థాయిలో ధరలు పలికే ఛాన్స్
17న ప్రీ-బిడ్ మీటింగ్, 24 నుంచి ఈ-వేలం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కోకాపేట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఇదివరకే అభివృద్ది చేసిన భారీ లే అవుట్లలో మిగిలిన ప్లాట్ల వేలానికి (Land Auction) ఎట్టకేలకు వేళయింది. ఈ ప్లాట్లను ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో నిర్వహించిన ప్లాట్ల వేలంలో కోకాపేట లో నియోపోలిస్ లే అవుట్ లోని ఎకరంగా ఏకంగా రూ.వంద కోట్లు పైచిలుకు పలికి రికార్డు సృష్టించింది. అప్పట్లో నిర్వహించిన ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,300 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి రూ.5వేల కోట్లపైనే ఆదాయం సమకూరవచ్చునని హెచ్ఎండీఏ అధికారులు అంచనాలేస్తున్నారు.

కోకాపేట్‌లోని నియో పోలీస్ లేఅవుట్‌లో ఆరు ప్లాట్లు, గోల్డ్ మైన్ లే అవుట్‌లోని ఒక ప్లాట్, మేడ్చల్ జిల్లాలోని మూసాపేట్‌లో రెండు ప్రాంతాల్లోని భూములకు ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను హెచ్ఎండీఏ సోమవారం జారీ చేసింది. ఈ-వేలం కార్యక్రమాన్ని ఎంఎస్‌టీపీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి వేలం ప్రక్రియ ప్రారంభించి, డిసెంబర్ 5 వరకు నిర్వహించనున్నారు. ప్లాట్ల వారీగా వేలం పాటు తేదీలను కూడా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ లో పేర్కొంది. తొలి రోజు వేలంలో నియోపోలీస్ ప్లాట్ నెంబర్ 17 తో వేలం ప్రక్రియను ప్రారంభించి చివరి తేదీ అయిన డిసెంబర్ 5న గోల్డ్ మెన్ లే అవుట్‌లోని ప్లాట్ నెంబర్-2 వేలంతో ప్రక్రియ ముగించనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.

ప్రారంభ ధర రూ.99 కోట్లు

కోకాపేట్ లోని నియో పోలీస్ లేఅవుట్ లో ఆరు ప్లాట్లకు ఈ-వేలం వేయనున్నారు. ఎకరాకు ప్రారంభ ధర రూ.99కోట్లు నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ 4 ఎకరాలకుపైగా ఉండడంతో ప్రారంభ ధరనే రూ.400కోట్లకుపైగా నిర్ణయించారు. అయితే గతంలో ప్రారంభ ధర రూ.36 కోట్లు నిర్ణయిస్తే డిమాండ్ భారీగా పెరిగి వేలంలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికింది. ఈ సారి కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రియల్టర్లు, అధికారులు భావిస్తున్నారు. ఇదే కోకాపేట్ లో గోల్డ్ మైన్ లే అవుట్ లోని 1.98 ఎకరాల ప్లాట్ ప్రారంభ ధర ఎకరాకు రూ.70 కోట్లుగా నిర్ణయించారు.

లేఅవుట్ ప్లాట్ల నంబర్లు, వేలం తేదీల వివరాలు
నియో పోలీస్ ప్లాట్ నంబర్ 17, భూమి విస్తీర్ణం 4.59 ఎకరాలు, ప్రారంభ ధర రూ.99 కోట్లు, వేలం తేదీ నవంబర్ 24
నియోపోలీస్ ప్లాట్ నంబర్ 18, భూమి విస్తీర్ణం 5.31 ఎకరాలు, ప్రారంభ ధర రూ. 99 కోట్లు, వేలం తేదీ నవంబర్ 24
నియోపోలీస్ ప్లాట్ నంబర్ 15, భూమి విస్తీర్ణం 4.03 ఎకరాలు, ప్రారంభ ధర రూ.99 కోట్లు, వేలం తేదీ నవంబర్ 25
నియోపోలీస్ ప్లాట్ నంబర్ 16, భూమి విస్తీర్ణం 5.03 ఎకరాలు, ప్రారంభ ధర రూ.99 కోట్లు, వేలం తేదీ నవంబర్ 28
నియోపోలీస్ ప్లాట్ నంబర్ 19, భూమి విస్తీర్ణం 4 ఎకరాలు, ప్రారంభ ధర రూ.99 కోట్లు, వేలం తేదీ డిసెంబర్ 3
నియోపోలీస్ ప్లాట్ నంబర్ 20, భూమి విస్తీర్ణం 4.04 ఎకరాలు, ప్రారంభ ధర రూ.99 కోట్లు, వేలం తేదీ డిసెంబర్ 3
గోల్డ్ మైన్ సైట్-2, భూమి విస్తీర్ణం 1.98 ఎకరాలు, ప్రారంభ ధర రూ. 70 కోట్లు, వేలం తేదీ డిసెంబర్ 5

Read Also- Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బస్సు ప్రమాదం మరువకముందే మరో బీవత్సం.. ఇంట్లోకి దూసుకుపోయిన..!

మూసాపేట్ లో ఎకరాకు రూ.75 కోట్లు

మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని మూసాపేట్ వై-జంక్షన్ సమీపంలో రెండు ప్రాంతాల్లో 16 ఎకరాల భూములను ఈ-వేలం ద్వారా విక్రయించాలని హెచ్ఎండీఏ నిర్ణయిచింది. అయితే ఎకరాకు ప్రారంభ ధరగా రూ.75కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 16 ఎకరాలకు గాను ప్రారంభ ధర ప్రకారం రూ.1200 కోట్లు అవుతుంది. వేలం ద్వారా రేటు మరింత పెరిగే, అధికారులు అంఛనా వేసిన దాని కన్నా ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

రెండేళ్ల క్రితం వేలంలో..

కోకాపేట్ నియో పోలీస్‌లో 2023లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన ఈ వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రారంభ ధర ఎకరాకు రూ.36 కోట్లుగా నిర్ణయించగా, వేలంలో రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయింది. రెండో దశ వేలంలో ఎకరం భూమికి అత్యధికంగా రూ.72 కోట్లు, అత్యల్పంగా రూ.51.75 కోట్లు పలికింది. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,300 కోట్ల ఆదాయం వచ్చింది.

Read Also- Kishan Reddy: అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నది ఎవరు?.. ప్రభుత్వం పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈనెల 17న ప్రీ బిడ్ మీటింగ్

కోకాపేట్, మూసాపేట్ భూములకు సంబంధించిన ఫ్రీబిడ్ మీటింగ్ ఈనెల 17వ తేదిన మాదాపూర్ లోని టీ-హబ్ లో నిర్వహించనున్నారు. అయితే కోకాపేట్ నియోపోలీసు లేఅవుట్, గోల్డ్ మైన్ లేఅవుట్, మూసాపేట్ భూములకు సంబంధించిన ఒక్కో ప్లాట్ కు ఈఎండీ రూ.5కోట్లుగా నిర్ణయించారు. నియోపోలీసు లేఅవుట్ లోని 17,18 ప్లాట్లకు ఈనెల 20వ తేదీన ఈఎండీ చెల్లిస్తే 24వ తేదిన ఈ-వేలం నిర్వహించనున్నారు. 15,16 ప్లాట్లకు 24వ తేదిలోగా చెల్లిస్తే 28వ తేదీన, 19,20 ప్లాట్లకు 28వ తేదీన చెల్లిస్తే డిసెంబర్ 3వ తేదిన వేలం నిర్వహించున్నారు. ఇక కోకాపేట్ లోని గోల్డ్ మైన్ లే అవుట్ లోని ప్లాట్, మూసాపేట్ రెండు పార్శిళ్ల భూములకు డిసెంబర్ 1వ తేదిలోగా ఈఎండీ చెల్లిస్తే డిసెంబర్ 5వ తేదీన వేలం నిర్వహించనున్నారు.

 

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!