Mobile Recovery: సెల్ ఫోన్ చోరీ అయినా.. పోగొట్టుకున్నా వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) ముత్యంరెడ్డి (‘ DCP Muthyam Reddy )సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కూడా కంప్లయింట్ ఇవ్వవచ్చని చెప్పారు. సైబరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు 45 రోజుల్లో 2కోట్ల రూపాయల విలువ చేసే 827 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. సైబరాబాద్ పోలీస్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని బాధితులకు అప్పగించారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
6,233 సెల్ ఫోన్లను రికవరీ
ఈ సందర్భంగా డీసీపీ ముత్యం రెడ్డి (DCP Muthyam Reddy)మాట్లాడుతూ, సెల్ ఫోన్లలో ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం ఉంటుందన్నారు. వేరే వారి చేతుల్లోకి ఈ సమాచారం చేరితే చెడు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దానికి తోడు చోరీ అయిన, పోగొట్టుకున్న ఫోన్లను అసాంఘిక శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు. ఎనిమిది విడతల్లో సైబరాబాద్ పోలీసులు మొత్తం 6,233 సెల్ ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, సైబర్ నేరాలపట్ల ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సెల్ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్ చేయవద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలన్నారు. దాంతోపాటు cybercrime.gov.in అన్న వెబ్ సైట్‌కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర వహించిన అదనపు డీసీపీ (క్రైమ్స్) రామ్ కుమార్, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, సీఐలు సంజీవ్, పవన్, రవికుమార్, డాలినాయుడు, రాజేశ్‌తోపాటు సిబ్బందిని అభినందించారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..