Nagarkurnool district: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అక్రమాలపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల(Indiramma House)ను అనర్హులకు కేటాయించవద్దని ఇడ్లు లేని నిరుపేదలకు మాత్రమే కేటాయిచాలని అధికారులు ఇప్పటికే మంత్రులు(MP), ఎమ్మెల్యే(MLA)లు, జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా కొందరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District)లో నలుగురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badawat Santosh) సస్పెండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆ నలుగురు కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది.
పాత స్థలాలకు కొత్త వాటిగా ఎంపిక
జిల్లా పరిధిలోని బిజినేపల్లి మండలం గంగారం, అల్లీపూర్, బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లి, ఊరుకొండ మండలం గుడిగానిపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. అయితే అప్పటికే కట్టి ఉన్న పాత(Old) బేస్ మెంట్ స్థాయిలో ఉన్న స్థలాలకు నూతనంగా(New) ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులుగా గ్రామ కార్యదర్షులు ఎంపిక చేశారు. దీనిపై అధికారులు విచారణ చేసి వాస్తవంగా నిర్ధారించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆయా గ్రామాలకి చెందిన కార్యదర్శులు నరేందర్ రెడ్డి(Narender Reddy), రజని(Rajini), బాలరాజు(Bala Raju), రామచంద్రయ్య(Ramachandrayala)ల అనే కార్యదర్షులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: MLA Murali Nayak: పేదల జీవితాల్లో సంతోషం నింపిన ప్రజా ప్రభుత్వం
పేదలకు భద్రమైన వసత కల్పించాలనే
నిరుపేదలకు సోంత గృహాల కల్పన, గ్రామీణ మరియు పట్టణ(Rural and urban) పేదలకు భద్రమైన వసత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. బలహీన వర్గాలకు స్వీయ గృహ కల్పన ద్వారా గౌరవ జీవితాన్ని జీవించే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. నివాస స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణం, స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇల్లును ప్రభుత్వం అందించనుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ ఇసుక, సిమెంట్, ఇనుప మొదలైనవి కొంతమేర ప్రభుత్వం అందింనుంది.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ప్రత్యేక కథనంతో.. ఎట్టకేలకు ఆస్పత్రి వైద్య సేవలకు మోక్షం..