MLA Murali Nayak: ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుల ఖాతాల్లో రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి క్వింటాళ్లు కు 500 తో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల జీవితాల్లో సంతోషాన్ని నింపిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(Bhukya Murali Naik) పేర్కొన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల(Ration card) పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళి నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడారు.
కొత్త రేషన్ కార్డులను మంజూరు
గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదలకు తీవ్ర అన్యాయాన్ని చేశాయన్నారు. గత పది ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయని టిఆర్ఎస్(TRS) ప్రభుత్వాన్ని తల వంచి కాంగ్రెస్కు(Congress) అధికారం కట్టబెట్టిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం వెన్నంటి ఉంటుందన్నారు. రాష్ట్రంలో 16 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్నిదని పేర్కొన్నారు. పేదల నుంచి ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించిన ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో పేదల కష్టాలను అర్థం చేసుకొని, వారి సమస్యల పరిష్కారానికి నడుంబిగించి ముందుకు సాగుతుందన్నారు.
Also Read: Bhatti Vikramarka: దళిత బంధు లబ్ధిదారులకు నిధుల జమ.. భట్టి విక్రమార్క
పల్లె ప్రజలకు అండగా
ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డుల ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు. రేషన్ కార్డు అందించడం ప్రతి పేదవాడి హక్కుగా భావించి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఆ దిశగా సాగుతుందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈనెల 25 నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డు(Ration card)లు పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. అనతి కాలంలోనే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి పేదల ప్రభుత్వంగా ప్రచాధారణ పొందింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.
Also Read: Dengue cases: సిటీపై సీజనల్ వ్యాధుల వార్.. పెరుగుతున్న డెంగ్యూ కేసులు