Dengue cases (imagecredit:twitter)
హైదరాబాద్

Dengue cases: సిటీపై సీజనల్ వ్యాధుల వార్.. పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Dengue cases: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లోని పేదలు నివసించే మురికివాడలు, బస్తీలకు సుస్తీ అయింది. కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా శానిటేషన్ స్తంభించింది. కొద్ది రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై మురుగునీరు ప్రవహించటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం నెలకొని, స్థానికులు ఆరోగ్యం పాలిట శాపంగా మారింది. వానాకాలం నేపథ్యంలో శానిటేషన్ పనులు, దోమల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని జీహెచ్ఎంసీ ప్రకటిస్తున్నా, ఆ చర్యలు కేవలం వీవీఐపీలు, వీఐపీలు నివసించే ప్రాంతాలకే పరిమితమయ్యాయన్న విమర్శలున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు నీటి వాసన వస్తున్నట్లు స్థానికులు వాపోయారు. ఫలితంగా మురికివాడలు, బస్తీల్లో నివసించే ప్రజలు డయేరియా బారిన పడాల్సి వస్తుందని పలు మురికివాడల ప్రజలు వాపోతున్నారు.

పంజా విసురుతున్న దోమలు
నగరంలోని సుమారు 1700 మురికివాడల్లో వందలాది మంది జలుబు, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మలేరియా, డయేరియా, డెంగీ తదితర వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా రాంకీ తరలించాల్సిన చెత్త కుప్పలను స్థానిక మెడికల్(Medical) ఆఫీసర్లు స్వచ్చ ఆటో టిప్పర్లు తరలించాలని బలవంతం చేయటంతో, కార్మికులు సకాలంలో చెత్తను తరలించకపోవటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అనారోగ్య లక్షణాలు కన్పించగానే వీరిలో చాలా మంది లోకల్ క్లీనిక్(Local Clinic) లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నందున మలేరియా, డయేరియా, డెంగీ వంటి కేసులు బయటకు రావటం లేదు.

ఈ మురికివాడల్లోని పలు క్లీనిక్ లు, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే నగరంపై సీజనల్ వ్యాధులు(Seasonal diseases) వార్ చేస్తుండగా, సిటీలోని 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో డెంగీ అనుమానిత కేసులు వస్తున్నట్లు సమాచారం. 496 బస్తీ దవాఖానాలు మంజూరైనా, ప్రస్తుతం 259 బస్తీ దవాఖానాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సీజన్ లోనే డెంగీ వ్యాధి ఎక్కువ ప్రబలుతున్నట్లు నివేదికలు చెబుతున్నా, బస్తీ దవాఖానాల సంఖ్య మాత్రం పెరగటం లేదు.

Also Read: Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!

పెరుగుతున్న ఓపీ కేసులు
వివిధ సీజనల్ వ్యాధుల లక్షణాలతో బాధడుతూ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి(Fever Hospital)కి చికిత్స కోసం ప్రతి రోజు 200 నుంచి మూడు వందల మధ్య ఔట్ పేషెంట్ కేసులు వస్తుండగా, కొద్ది రోజుల నుంచి ఓపీ(OP) కేసులు పెరుగుతున్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ప్రైవేటు క్లీనిక్ లలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేల మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కో బస్తీ దవాఖానాలో వ్యాధి నిర్థారణ కోసం వందల సంఖ్యలో బ్లడ్ శ్యాంపిల్స్ సేకరిస్తున్నట్లు సమాచారం. మహానగరంలో దోమల నివారణ కోసం జీహెచ్ఎంసీ(GHMC) ప్రత్యేకంగా ఎంటమాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని, ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా, దోమల నివారణ చర్యలు అన్ని ప్రాంతాల్లో అమలు కావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా దోమల నివారణ కోసం అనుసరిస్తున్న ఫాగింగ్ విధానం కేవలం ప్రగతి భవన్(Pragathi Bhavan), రాజ్ భవన్(Raj Bhavan(), అసెంబ్లీ(Assembly) ఆవరణ, కొత్త సచివాలయం, జీహెచ్ఎంసీ(GHMC) ప్రధానక కార్యాలయం, బీఆర్కే భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిష్టర్ క్వార్టర్స్ తదితర ఉన్నతాధికారులు, వీఐపీలుండే ప్రాంతాల్లోనే చేస్తున్నారే తప్పా, పేదలు నివసించే మురికివాడల్లో, మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీల్లో ఫాగింగ్ చేయటంలో జీహెచ్ఎంసీ(GHMC) విఫలమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Forest Police Stations: భూముల ఆక్రమణ కాకుండా పకడ్బందీ ప్లాన్

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది