oo-cheliya (image :X)
ఎంటర్‌టైన్మెంట్

O Cheliya movie: ‘ఓ చెలియా’ సినిమా నుంచి మెలోడీ సాంగ్ వచ్చింది.. చూశారా మరి?

O Cheliya movie: అందమైన ప్రేమకథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిరిస్తూనే ఉంటారు.  అంతే కాకుండా వాటికి ఎప్పుడూ సపోర్ట్ లభిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రేమ కథతో రాబోతుంది ‘ఓ చెలయా’ మూవీ. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యాయి. తాజాగా హీరో నవీన్ చంద్ర చేతులు మీదుగా కొంచెం కొంచెంగా అంటూ సాగే మెలోడీ పాటను టీం విడుదల చేయించింది.

Read also-Jio Prepaid Plans: జియో స్పెషల్ ఆఫర్.. రూ.189కే 5జీ డేటా, అపరిమిత కాల్స్.. ఆపై లైవ్ ఛానల్స్, టీవీ షోస్!

ప్రస్తుతం ఈ పాట శ్రోతల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. ఎంఎం కుమార్ బాణీ వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంది. సుధీర్ బగాడి సాహిత్యం అయితే అందరికీ అర్థమయ్యేలా ఉంది. వాగ్దేవి, మనోజ్ పాడిన ఈ యుగళ గీతం, వారి గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎంత ఘాడమైన ప్రేమ అల్లుకుని ఉందో అర్థం అవుతోంది. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఓ.. చెలియా’ నుంచి విడుదలైన ‘కొంచెం కొంచెంగా’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ మంచి మెలోడీ పాటను వినలేదు. హీరో హీరోయిన్లు చాలా చక్కగా కనిపిస్తున్నారు. లవ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాల్ని కలగలపి సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు.’ అని అన్నారు.

O Cheliya still
O Cheliya still

Read also-Tatkal Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ స్మాల్ టిప్స్ పాటిస్తే.. సెకన్లలోనే తత్కాల్ టికెట్లు పొందొచ్చు!

ఈ చిత్రానికి సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి, అజయ్ గోష్, భోగిరెడ్డి శ్రీనివాస్, సారిపల్లి సతీష్, యశోద ఆర్ కొలిశెట్టి, సునీల్ రావినూతల, డార్లింగ్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలైన లిరికల్ వీడియోను చూస్తుంటే.. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. లొకేషన్స్ కూడా రిఫ్రెష్ గా ఉన్నాయి. అందించిన బాణీలు ఎక్కడా బోర్ కొట్టకుండా అందరూ పాడుకునేలాగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ పాట్ సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Kenya Landslides Tragedy: కెన్యాలో భారీ వర్షాలు.. విరిగిన కొండచరియలు 21 మంది మృతి, వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం

Baahubali The Epic: అదరగొడుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతంటే?

Hydra: కూకట్‌పల్లి చెరువుకు పూర్వవైభవం హైడ్రా అద్భుతం.. స్థానికుల ఆశ్చర్యం

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆర్టీసీ ఢీ.. స్పాట్లో 17 మంది మృతి

Dude movie ott: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా!.. ఎక్కడంటే?