Jio Prepaid Plans: ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో టెలికాం సంస్థల మధ్య పోటీ తీవ్రతరమైపోయింది. ఎయిర్ టెల్ (Airtel), జియో (Jio), బీఎస్ఎన్ఎల్ (BSNL) వంటి ప్రముఖ టెలికాం సంస్థలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో తన కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం రూ.189 (Jio Rs 189 Plan) కే స్పెషల్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్ లో వచ్చిన ఈ ప్లాన్.. జియో యూజర్లను ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.
రూ.189 ప్లాన్ ఆఫర్స్..
ఈ ప్లాన్ ను 28 రోజుల కాలానికి జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్ లో 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ లు లభించనున్నాయి. వీటితో పాటు JioTV (జియో టీవీ), జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ పై రోజుకు రూ.6.75 మాత్రమే ఖర్చు కానుండటం విశేషం.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
ఈ రీఛార్జ్ ప్లాన్ లో అపరిమిత కాల్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా, ఏ నెట్ వర్క్ కైనా కాల్ చేసుకునే సౌకర్యాన్ని ఈ ప్యాక్ అందిస్తుంది. రోజూ అధికంగా కాల్స్ చేసేవారికి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.
ఎస్ఎంఎస్ సౌకర్యం
ఈ ప్లాన్‌లో 28 రోజుల కాలానికి 300 SMSలు లభిస్తాయి. అవసరమైనప్పుడు మెసేజ్‌లు పంపడానికి లేదా స్వీకరించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.
డేటా ప్రయోజనాలు
రూ.189 ప్లాన్ లో 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. దీనిని నెల మెుత్తానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ 2జీబీ డేటా పూర్తయిన తర్వాత 64 Kbps వేగంతో నెట్ కనెక్షన్ కొనసాగుతుంది. 5G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు వేగవంతమైన 5G స్పీడ్స్‌ను ఆస్వాదించవచ్చు.
ఉచిత సబ్‌స్క్రిప్షన్ సేవలు
ఈ ప్రీపెయిన్ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు ఉచితంగా JioTV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. అందులో లైవ్ టీవీ, న్యూస్, సీరియల్స్, ఎంటర్ టైన్ మెంట్ షోలు మరెన్నో చూడవచ్చు. అలాగే JioAICloud ద్వారా కాంటాక్ట్స్, మెసేజ్‌లు, ఫైల్‌లు వంటి డేటాను సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.
ఎవరికి ఉత్తమం?
రూ.189 జియో ప్యాక్ తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి.. బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్ కావాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
Also Read: Tatkal Booking: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ స్మాల్ టిప్స్ పాటిస్తే.. సెకన్లలోనే తత్కాల్ టికెట్లు పొందొచ్చు!
ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?
రూ.189 ప్లాన్ పొందాలనుకునే యూజర్లు.. ముందుగా జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ (MyJio App) ఓపెన్ చేయాలి. మీ మొబైల్ నంబర్ తో OTPతో లాగిన్ అవ్వండి. హోమ్‌పేజ్‌లో “రీచార్జ్” విభాగం క్లిక్ చేసి.. రూ.189 ప్లాన్‌ను ఎంచుకోండి. అనంతరం అక్కడ కనిపించే “Buy” బటన్‌పై క్లిక్ చేయండి. తర్వాత PhonePe, Google Pay, UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు పూర్తి చేయండి.
