Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: ఆటో డ్రైవర్ ఘరానా మోసం.. వృద్ధుడి సెల్ ఫోన్​ కొట్టేసి ఆపై ఎంచేశాడంటే?

Crime News: సెల్​ ఫోన్ కొట్టేసి బ్యాంక్​ ఖాతాను ఖాళీ చేసిన ముగ్గురిని హైదరాబాద్​(Hyderabada) సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ దార కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 68 ఏళ్ల వృద్ధుడు గతనెల 17న తార్నాక వెళ్లటానికి ఉప్పల్​ వద్ద షేరింగ్ ఆటో ఎక్కాడు. డ్రైవర్ మహ్మద్​ మొయినుద్దీన్ (31) డబ్బును ఫోన్ పే ద్వారా చెల్లించమని అడగటంతో వృద్ధుడు ఫోన్ ను అన్ లాక్​ చేసి డబ్బు చెల్లించాడు. కాగా, ఆటోలో అతని పక్కనే కూర్చున్న మహ్మద్​ మొయినుద్దీన్ సహచరుడు మహ్మద్​ సయ్యద్ సల్మాన్ (21) మొబైల్ ఫోన్ లాక్​ కోడ్​ నెంబర్ చూసి గుర్తు పెట్టుకున్నాడు.

వృద్ధుని దృష్టి మరల్చి..

ఆ తరువాత తార్నాక వద్ద నిందితులు ఇద్దరు కలిసి వృద్ధుని దృష్టి మరల్చి ఫోన్ ను తస్కరించి వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తరువాత నేరుగా మేడ్చల్​ వెళ్లి పెట్రోల్ పంపుతోపాటు మరికొన్ని షాపుల్లో చోరీ చేసిన మొబైల్ ద్వారా ఆన్​ లైన్ పేమెంట్లు చేసి నగదు తీసుకున్నారు. తమ మరో సహచరుడైన మహ్మద్ హుస్సేన్ (32) తో కలిసి మొత్తం 1.95లక్షల రూపాయలను స్వాహా చేశారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన సైబర్​ క్రైం సీఐ ప్రమోద్ కుమార్, ఎస్​ఐ షేక్​ అజీజ్ తోపాటు కానిస్టేబుళ్లు ప్రభు, విజయ్, రామాంజనేయ ప్రసాద్​, వేణు, శ్రీనివాస్ అశ్విన్ తో కలిసి విచారణ జరిపి నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Also Read: KV Schools: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4 కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు

అక్రమంగా చొరబడి… డ్రగ్స్ దందా చేస్తూ..

అక్రమంగా దేశంలోకి చొరబడటమే కాకుండా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశస్తున్ని ఈస్ట్ జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం వన్ టైం వీసాపై స్వదేశానికి తిప్పి పంపించారు. టాస్క్​ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా దేశానికి చెందిన జాఫ్రీ డోజీఒబైబ్ (33) 2019లో నేపాల్ దేశం మీదుగా సరిహద్దులు దాటి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తరువాత హైదరాబాద్ చేరుకున్నాడు. తేలికగా డబ్బు సంపాదించేందుకు మరికొందరు నైజీరియా దేశస్తులతో కలిసి హైదరాబాద్, బెంగళూరులో డ్రగ్స్ దందా చేస్తూ వస్తున్నాడు. కాగా, టాస్క్ ఫోర్స్​ సీఐ చంద్రశేఖర్, ఎస్​ఐలు కరుణాకర్ రెడ్డి, అనంతచారి, నాగరాజుతో కలిసి ఇటీవల జాఫ్రీని అరెస్ట్ చేశారు. విచారణలో అతను అక్రమంగా ఇక్కడ ఉంటున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో జాఫ్రీని హోంకు తరలించిన పోలీసులు వన్​ టైం వీసా తయారు చేయించి శుక్రవారం అతన్ని స్వదేశానికి పంపించి వేశారు.

Also Read: Local Body Elections: బండి వర్సెస్ ఈటల.. మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. బీజేపీ తర్జన భర్జన

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..