KV Schools (imagecredit:twitter)
తెలంగాణ

KV Schools: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4 కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు

KV Schools: తెలంగాణలో విద్యాభివృద్ధికి 11 ఏండ్లుగా అన్నిరకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా.. మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయి. కాగా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కేంద్రం(యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు(Mulugu) జిల్లా కేంద్రం(గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా.. జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ లో, వనపర్తి జిల్లా నాగవరం శివారులో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవి కాకుండా గత రెండేళ్లలోనే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా పీఎంశ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం. ఇది కాకుండా.. సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేళ్లలో.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం.. దాదాపు రూ.2వేల కోట్లను కేటాయించింది. దాదాపు వెయ్యికోట్లతో.. ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోడీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Richest Indians: సంపన్నుల లిస్ట్ విడుదల.. బిలియనీర్ల జాబితాలోకి షారుఖ్‌.. ఎవరి ఆస్తి ఎంతంటే?

దసరా, దీపావళికి 1450 ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులను అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు సౌకర్యం కోసం అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ పండుగలకు గాను 1,450 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనంగా మరో 500 ప్రత్యేక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇదిలాఉండగా ప్రధాన మార్గాల్లో సుమారు 350 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటుచేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సాధారణ సందర్భాల్లో ఈ స్టేషన్‌లో 1.3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా పండుగ వేళ ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ చివరి వరకు కొనసాగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం విషయంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. పండగ వేళ దేశంలోని ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరిసేలా ఇప్పటికే 99 శాతం వస్తు, సేవలపై జీఎస్టీని తగ్గించింది. తాజాగా దసరా పండగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు 2025 జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. డీఏ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.10,084 కోట్ల భారం పడనుంది.

Also Read: CPI: సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఆ జిల్లాలోనే?: పల్లా వెంకటరెడ్డి

Just In

01

TG Government Lands: ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం ఫోకస్.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి!

Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ పై పోలీసులు ఉక్కుపాదం.. 22 మంది అరెస్ట్!

Kantara 1 review: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ఎలా ఉందంటే?

RV Karnan: దుర్గం చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!