CPI: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రజలను మత పరంగా చీల్చడంతో పాటు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని అధికారాన్ని కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ లోని సీపీఐ(CPI) రాష్ట్రపార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఫ్యాసిస్టు విధానాలను వామపక్ష పార్టీలన్ని కలిసి కట్టుగా ఎదుర్కొవాలని లేక పోతే దేశం ప్రమాదం లో పడనుందన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు ద్వారా 400 సీట్లతో ఏకచత్రాపధంగా ఉన్న బీజేపీ బలాన్ని 240కి తగ్గించగలిగామని, మరింత ఐక్యంగా ముందుకు సాగడం ద్వారా ఆపార్టీని కట్టడి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
100 ఏళ్ల ముగింపు ఉత్సవాలు..
సిపిఐ సంస్థగతంగా, సైద్ధాంతికంగా బలోపేతం చేసుకోవడం ద్వారా క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ దేశ వ్యాప్తంగా బలమైన ప్రజా ఉద్యమాలకు సంసిద్దం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీపీఐ 100 ఏళ్ల ముగింపు ఉత్సవాలను ఖమ్మంలో డిసెంబర్ 26న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా చత్తీష్గడ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల నుంచిపార్టీ నేతలు పాల్గొనబోతున్నారని వెల్లడించారు. ఆ తర్వాత ఉద్యమ కార్యచరణను రూపొందించుకుని ముందుకు సాగనున్నట్లు ఆయన వెల్లడించారు.సీపీఐ సెంట్రల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ(K Narayana) మాట్లాడుతూ దేశంలోని కొంతమంది కార్పొరేట్ ఆర్థిక నేరగాళ్లు రూ.16లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోతే కేంద్రంలో అధికారం ఉన్నబీజేపీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో జీఎస్టి పేరుతో రూ.15లక్షల కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని లూటీ చేసిందని విమర్శించారు.
Also Read: OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!
ట్రాన్స్ జెండర్లకు సైతం..
అదే బీజేపీ నాయకులు జిఎస్టి తగ్గింపు పేరుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.15 వేల అదా చేస్తున్నామంటూ నీతులు చెబుతోందని ఆయన మండి పడ్డారు. బీ(Bihar)హర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఈ నాటకాలన్ని ఆయన విమర్శించారు. అయితే బీహర్లో బిజెపి(BJP)ని ఓడించేందుకు ఇండియా కూటమి సర్వ శక్తులను ఒడ్డనుందని చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు సైతం సీపీఐ(CPI)లో సభ్యత్వం ఇవ్వడం ద్వారా కమ్యూనిస్టు ఉద్యమంలో వారిని భాగస్వామ్యం చేయాలని సీపీఐ జాతీయ మహాసభలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బిగ్ బాస్ ను నిషేదించేంత వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు.