Banks Holiday 2025 (Image Source: Twitter)
Uncategorized

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!

Bank Holidays 2025: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలవారీగా అధికారిక సెలవు క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో అక్టోబర్ లో ఏకంగా 15 బ్యాంకు సెలవులు ఉన్నాయని ప్రకటించింది. అయితే దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రానికొకలా ఉంటాయి. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగల ఆధారంగా ఇవి నిర్ణయించబడతాయి. ఇవి కాకుండా ప్రతీ ఆదివారం అలాగే అక్టోబర్‌లో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులు మూతబడనున్నారు. ఇంతకీ అక్టోబర్ లో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు కేటాయించారు? సెలవు రోజున ఏ ఏ నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి? ఇప్పుడు చూద్దాం.

అక్టోబర్ 1

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అక్టోబర్ 1న బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోల్ కత్తా, లక్నో, పాట్నా వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజున బ్యాంకులు మూతపడనున్నాయి.

అక్టోబర్ 2

గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ సెలవు ప్రకటించారు. అలాగే ఇదే రోజున దసరా కూడా రావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

అక్టోబర్ 3, 4

సిక్కింలోని గాంగ్టక్‌లో దసైన్ (దుర్గాపూజ) సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

అక్టోబర్ 6

త్రిపురలోని అగర్తలాలో లక్ష్మీ పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 7

వాల్మీకి మహర్షి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా.. బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, శిమ్లా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

అక్టోబర్ 10 

శిమ్లాలో కర్వా చౌత్ సందర్భంగా బ్యాంకులను ఆర్ బీఐ సెలవులు ప్రకటించింది.

అక్టోబర్ 18

గౌహతిలో కాటి బిహు సందర్భంగా బ్యాంకులు మూసివేయనున్నారు.

అక్టోబర్ 20

కొన్ని రాష్ట్రాల్లో దీపావళి ముందే జరుపుకోనుండటంతో ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉండనుంది. అగర్తలా, అహ్మదాబాద్, ఐజవల్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, చండీగఢ్, గౌహతి, ఇటానగర్, జైపూర్, కాన్పూర్, న్యూ ఢిల్లీ తదితర ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.

అక్టోబర్ 21

ఈ రోజున పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఆర్ బీఐ సెలవు ప్రకటించింది. దీంతో బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్ టక్ , ఇంపాల్, జమ్మూ, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.

అక్టోబర్ 22

దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. అలాగే ఎంతో ముఖ్యమైన విక్రమ్ సమ్వత్ నూతన సంవత్సరం, గోవర్ధన పూజ సందర్భంగా కూడా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే ఉండనుంది.

అక్టోబర్ 23

లక్ష్మీ పూజ (దీపావళి), చిత్ర గుప్త జయంతి, భాయ్ బీజు, భాయ్ దూజ్ వంటి పర్వదినాల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఇవ్వబడ్డాయి. అహ్మదాబాద్, గ్యాంగ్ టక్, ఇంపాల్, కాన్పూర్, కోలకత్తా, లక్నో, షిమ్లా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

అక్టోబర్ 27

ఛఠ్ పూజ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా కోల్ కత్తా, రాంచీ నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

అక్టోబర్ 28

పాట్నా, రాంచీ ప్రాంతాల్లో ఛఠ్ పూజా సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

Also Read: Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఇది చూస్తే ఎప్పటికీ ఆ ధైర్యం చేయరు!

అక్టోబర్ 31

అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

Also Read: Lions In Beach: ఆడ సింహాల ఒత్తిడి.. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తోన్న మగ సింహాలు.. ఇదేందయ్యా ఇది!

Just In

01

ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు

Kadiyam Srihari: ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు.. కడియం శ్రీహరి కీలక వాఖ్యలు

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీ కోటమైసమ్మ తల్లి అతి పెద్ద జాతర.. ఈ విశిష్టత కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!