Bhatti Vikramarka: మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. అదే విధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లులను చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం ప్రజాభవన్ లో ఆర్టీసీ(RTC), బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజెపి కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Cyber Crime: వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్స్ ముఠా.. పల్లెల్లో బ్యాంక్ ఖాతాలు తీసి..!
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లభాల్లోకి..
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసి బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి కీలకమైన చర్యలను తీసుకుంటోందని అన్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లభాల్లోకి వచ్చిందని అన్నారు. అంతేగాక మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటుగా, ప్రభుత్వం అందించిన సహాకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అంతేకాక బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటుగా సంస్థ స్వతహాగా నూతనంగా ఆదాయా మార్గాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Also Read: Shambhala: నేచురల్ స్టార్ వదిలిన ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

