Film Industry: గత కొద్దీ రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలను చుస్తున్నాము. అయితే, దీనికి గల సరైన కారణం తెలియదు. అయితే, సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఆ చెట్టు వలెనే అని అంటున్నారు. మరి, ఆ చెట్టు ఏం చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..
గోదావరి జిల్లాల్లోని కొవ్వూరు మండలం, తాళ్ళపూడి సమీపంలోని కుమారదేవం గ్రామంలో ఒక బ్రహ్మాండమైన నిద్ర గన్నేరు చెట్టు కథ, ఒకప్పుడు సినిమా పరిశ్రమకు అండగా నిలిచింది. సుమారు 145 సంవత్సరాల క్రితం శ్రీ సింగలూరి తాతబ్బాయి నాటిన ఈ చెట్టు, కాలక్రమంలో ఒక మహా వృక్షంగా ఎదిగి, గోదావరి ఒడ్డున అందరికీ నీడనిచ్చే విధంగా మారింది. అంతేకాదు, ఇది సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు పొందింది.
ఒకప్పుడు ఈ చెట్టు కింద ‘పాడిపంటలు’, ‘దేవత’, ‘వంశవృక్షం’, ‘బొబ్బిలిరాజా’, ‘హిమ్మత్ వాలా’, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘లేడీస్ టైలర్’ లాంటి వందకి పైగా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఈ చెట్టు సినిమాల్లో ఓ పాత్రలా మెరిసింది, అందుకే దీన్ని ‘సినిమా చెట్టు’ అని పిలిచారు. కానీ, గత ఏడాది వచ్చిన గోదావరి వరదలు ఈ చెట్టును కూల్చేశాయి. 145 ఏళ్లుగా అనేక వరదలను, తుఫానులను తట్టుకున్న ఈ వృక్షం ఒక్క వరదకే పడిపోవడంతో గ్రామస్తులు, ఈ చెట్టుతో అనుబంధం ఉన్నవారు బాధపడ్డారు.
Also Read: Poonam Kaur: నిర్మాతలు ఆ పని చేయండి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్
సినిమా షూటింగ్‌లు ఇక ఇక్కడ జరగవని అంతా అనుకున్నారు. అయితే, రాజమండ్రి రోటరీ క్లబ్ ఈ చెట్టుకు పునర్జన్మ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకొచ్చింది. వారి కృషి ఫలించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ చెట్టు మళ్లీ చిగురించడం మొదలు పెట్టింది. ఈ పరిణామంతో గ్రామస్తులు ఆనందంలో మునిగారు. ఈ విధంగా రక్షిస్తే, కొన్నేళ్లలో ఈ చెట్టు మళ్లీ పెద్దదై, నీడనిచ్చి, సినిమా షూటింగ్‌లకు వేదికగా నిలవాలని వారు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ‘సినిమా చెట్టు’ మళ్లీ సినిమా షూటింగ్‌లకు ఆకర్షణగా మారుతుందా? లేదో చూడాలి.