Amazon Employees: ‘మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాం’ అంటూ ఉదయాన్నే నిద్ర లేచే సమయానికి ఒక మెసేజ్ వచ్చి ఉంటే ఏవిధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి అనుభవమే అమెజాన్ ఉద్యోగుల్లో (Amazon Employees) కొందరికి మంగళవారం ఉదయం ఎదురైంది. కంపెనీకి చెందిన వేల సంఖ్యలో ఉద్యోగులు ఉదయం నిద్రలేవగానే ఉద్యోగాల నుంచి తొలగింపునకు సంబంధించిన టెక్స్ట్ మెసేజులు కనిపించాయి. దీంతో, ఉద్యోగులు ఆఫీస్‌కు చేరుకోకముందే తొలగిస్తున్నట్టుగా అమెజాన్ కంపెనీ నోటిఫికేషన్లు పంపించింది.
ఈ విషయం తెలిసి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్క్రీన్ షాట్లను వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక మెసేజ్‌లో సంబంధిత ఉద్యోగిని వ్యక్తిగత, లేదా ఆఫీస్ ఈ-మెయిల్‌ను చెక్ చేసుకోవాలంటూ కోరారు. మరొక ఎంప్లాయీకి జాబ్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలంటూ నోటిఫికేషన్ పంపించారు.
Read Also- Former Maoist: ఆరేళ్లక్రితం లొంగిపోయిన మావోయిస్టు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఫొటో ఇదిగో
14 వేల మందిని తొలగిస్తామంటూ ప్రకటన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌పై దృష్టి సారించడం, సామర్థ్యాల పెంపు కోసం చేపట్టిన ప్రధాన పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 14,000 ఉద్యోగులను తొలగించనున్నామని అమెజాన్ ఇటీవలే ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఉద్యోగుల కోతలు మొదలయ్యాయి. ప్రభావితమైన అమెరికన్ ఉద్యోగుల్లో ఎక్కువమంది అమెజాన్‌లో రిటైల్ మేనేజర్‌లుగా ఉన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 90 రోజుల పాటు పూర్తిస్థాయి జీతం, బెనిఫిట్స్, ఇతర ప్రయోజనాలు కల్పించనున్నట్టు అమెజాన్ హెచ్‌ఆర్ హెడ్ బెత్ గలెట్టి ఒక మెమోలో పేర్కొన్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతి ఈ తొలగింపులకు కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ చక్కటి పనితీరుతో దూసుకెళుతున్నప్పటికీ ఈ మార్పులు చేయాల్సి అవసరం ఏర్పడిందని అంటున్నారు.
Read Also- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?
ఈ వ్యవహారంపై అమెజాన్ హెచ్చార్ హెడ్ బెత్ గలెట్టి మాట్లాడుతూ, ప్రపంచం వేగంగా మారుతోందని, ఇంటర్నెట్ తర్వాత ప్రపంచం చూస్తున్న పరివర్తనాత్మక టెక్నాలజీ ఏఐ అని అభివర్ణించారు. కంపెనీలు మునుపెన్నడూ లేనిస్థాయిలో వేగంగా ఆవిష్కరణ వీలు కల్పిస్తోందని గలెట్టి చెప్పారు. గత కొన్నేళ్లుగా సంస్థ కార్యకలాపాలను మెరుగుపరచుకోవడానికి మేనేజ్‌మెంట్ స్థాయిలను కుదిస్తున్నామని, అనవసరమైన ఉద్యోగుల వ్యవస్థను తగ్గించుకుంటున్నామని మిలెట్టి తెలిపారు. ఖర్చులను కట్టడి చేయడం, పనితీరు అంచనా, ఐదు రోజులు ఆఫీస్‌లో పనిచేయడం ఇలాంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
