Coimbatore Crime (Image Source: twitter)
క్రైమ్, జాతీయం

Coimbatore Crime: ప్రియుడితో షికారుకొచ్చిన విద్యార్థిని.. ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మృగాళ్లు.. పోలీసులు ఏం చేశారంటే?

Coimbatore Crime: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో బయటకు వచ్చిన 20 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత యువతి ఫ్రెండ్ పై దాడి చేసిన నిందితులు.. ఆనంతరం ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. అనూహ్య పరిణామాల అనంతరం వారిపై కాల్పులు సైతం జరిపారు.

అసలేం జరిగిందంటే?

కోయంబత్తూరులో ఆదివారం రాత్రి తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల పీజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారు. ఆదివారం రాత్రి 10.30 గం.ల ప్రాంతంలో కోయంబత్తూరు విమానాశ్రయం వెనుక ఉన్న బృందావన్ నగర్ వద్ద.. ఆ జంట కారును పార్క్ చేసింది. ఈ క్రమంలో కారు వద్దకు మోపెడ్ (ద్విచక్రవాహనం)పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. కారు అద్దాలు పగలకొట్టారు. కారులో ఉన్న ప్రియుడిపై దాడి చేసి, బెదిరించి.. విద్యార్థినిని బండిపై ఎక్కించుకొని తీసుకెళ్లారు.

పోలీసులకు ఫిర్యాదు..

యువతిని ఎత్తుకెళ్లడంతో అప్రమత్తమైన ప్రియుడు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రాత్రి 11 గం.ల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా.. తెల్లవారుజామున 4 గం.ల ప్రాంతంలో విద్యార్థినిని గుర్తించారు. అప్పటికే యువతిపై దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలి పారిపోగా.. యువతిని హుటాహుటీనా ఆస్పత్రిలో చేర్చారు.

నిందితులపై కాల్పులు.

యువతిపై దారుణానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మధురై జిల్లాకు చెందిన సతీష్, గుణ, కార్తి అనే ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు రోజువారి కూలీలుగా పని చేసుకుంటూ.. కోయంబత్తురూలోని ఒక అద్దె గదిలో జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు పట్టుకునే క్రమంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు కోయంబత్తుర్ సిటీ కమిషనర్ సరవణ సుందర్ తెలిపారు. ఈ క్రమంలో వారి కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కోయంబత్తుర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో సెన్సెస్ ప్రీ టెస్ట్ ప్రారంభం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

‘చీకట్లో గుర్తించలేకపోయింది’

అయితే బాధిత విద్యార్థిని మధురైకి చెందిన యువతి అని కోయంబత్తూరు సిటీ కమిషనర్ సరవణ సుందర్ తెలిపారు. ఆమె హాస్టల్ లో ఉంటూ కోయంబత్తూరులో పీజీ చదువుతోందని అన్నారు. అత్యాచారం అనంతరం యువతి షాక్ కు గురైందని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. అత్యాచార ఘటన తెలిసిన వెంటనే ఏడు బృందాలను రంగంలోకి దింపామని.. నేర చరిత్ర ఉన్న 60 మందికి పైగా చిత్రాలను బాధితురాలికి చూపించామని కమిషనర్ తెలిపారు. అయితే చీకటిగా ఉన్నందున దాడి చేసిన వ్యక్తులను బాధితురాలు గుర్తించలేకపోయినట్లు వివరించారు. నిందితులు కోలుకోగానే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సిటీ కమిషనర్ పేర్కొన్నారు.

Also Read: AICC: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా? ఇన్‌ఛార్జ్ మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ!

Just In

01

CM Revanth Reddy: జర్మనీ టీచర్లను నియమిస్తాం.. విద్యార్థులకు భాష నేర్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Viral Video: ఒరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. రైల్వే ప్లాట్ ఫామ్‌పైనే కాపురాలు పెట్టేశారు.. మీకో దండంరా అయ్యా!

Free ChatGPT: ఉచితంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్.. ఆశ్చర్యపరిచే నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

Kishan Reddy: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి

The RajaSaab: ‘రాజాసాబ్’పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అది మాత్రం పక్కా..