Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను
Ranga Reddy District (Image credit: swetcha reporter)
రంగారెడ్డి, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?

Ranga Reddy District:  అక్రమ పద్దతిలో చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఏకంగా ఓ మంత్రికి సంబంధించిన బంధువులమని ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏకంగా మంత్రులే, ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రుల, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని విషయం ఆవాస్తవం. ఎందుకంటే ప్రభుత్వంలోని పెద్దలందరూ భూ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కొందరు రియల్ వ్యాపారులు చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.


గ్రామ పంచాయతీ పరిధులను టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో(Ranga Reddy District) రియల్​ వ్యాపారం తగ్గిందనే ప్రచారంతో ఫాం ల్యాండ్స్​ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమంగా వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధులను టార్గెట్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రయవిక్రయాలు జరిపిస్తున్నారు. అందుకు ప్రధానంగా ఒక గుంటకు 121 గజాలు అయితే గజానికి ఓ రేటు నిర్ణయించి ఎన్ని గుంటల భూమి ఉంటాదో అన్ని గజాలకు ధరను నిర్ణయిస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం భూమిని ఎకరాల్లో ధరను కట్టిస్తున్నారు. దీని మొత్తం నాలా కన్వర్షన్ చేయకుండా చెట్లు పెట్టడం ఫ్రీకాస్ట్ ఏర్పాటు చేయడం చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు. నాలా కన్వెన్షన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఆ ఆదాయానికి కూడా స్థానిక రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారుల తప్పిదాల వలన ఫామ్ ల్యాండ్‌లకు గిరాకీ పెరిగింది.

Also ReadRanga Reddy District: కార్పొరేట్ పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రైవేట్ స్కూల్స్‌పై పర్యవేక్షణ ఎక్కడ?


ఇదీ విషయం

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 37,38,39లలో సుమారు 26 ఎకరాలలో నిబంధనలకు విరుద్ధంగా ఓ రియాలిటీ ఇన్ఫ్రా‌ డెవలపర్స్ లే అవుట్ చేశారు. అంతేకాకుండా 30 ఫీట్లు మట్టి రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కడీలకు నెంబర్లు వేసిన ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదేవిధంగా చుట్టూ ఫ్రీ కాస్ట్ ఏర్పాటు చేయడం దేనికి సంకేతం. డబ్బులకు కక్కుర్తి పడి రెవెన్యూ అధికారులు అటు పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంటే గుంటల్లో భూమి రిజిస్ట్రేషన్​ జరుగుతున్నప్పుడు కనీసం పరిశీలించాల్సిన రెవెన్యూ అధికారులకు సమయం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా గుంటల్లో గజాల్లో తక్కువ ఉన్న రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అమ్యమ్యాలతోనే రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మీద దృష్టి పెట్టడం లేదని ఈ సంఘటన బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతర్

తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీల ఫామ్ ల్యాండ్ వ్యాపారాన్ని నియంత్రించేందుకుగాను తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తేదీ 9.7.2021న పంచాయతీరాజ్ యాక్ట్ 2018, మున్సిపల్ యాక్ట్ 2019 నూతన చట్టం ప్రకారం ఫామ్ ల్యాండ్ వెంచర్లకు కనీసం 20 గుంటల తక్కువగా ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు చేయవద్దని మేమో నెంబర్ 2461/ pLa111/2020 ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు, జాయింట్ సబ్ రిజిస్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, కొందుర్గ్ తహసీల్దార్ ఈ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నారు.

రిజనల్ రింగ్ పేరుతో కస్టమర్లకు ఎర

రీజనల్ రింగ్ రోడ్ కొందుర్గు ప్రాంతం మీదుగా వెళ్తుందని త్రిబుల్ ఆర్ రాకతో భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్ వ్యాపారులు కస్టమర్లను నమ్మిస్తున్నారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ రావడం హైదరాబాద్ ప్రాంతానికి షాద్‌నగర్ సమీపంగా ఉండడంతో వెంచర్లు ఎక్కువ అవుతున్నాయి. అది అదునుగా భావించి కొంతమంది రియల్టర్లు వ్యవసాయ పొలాలను కొనుగోలు చేసుకొని, ఆ భూముల్లో అనాధికారికంగా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. దీంతో అటు రైతులను, ఇటు వినియోగదారులను నిండా మోసం చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా సాగు భూమిని నాలాకు కన్వర్జేషన్​ చేసుకొని ప్లాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ, అవేమీ తంటాలు పడకుండా స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఇష్టానుసారంగా ప్లాట్లు చేసేస్తున్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాలోని ప్రతి రూర ​ మండలంలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన నష్టమే ప్రస్తుతం జరుగుతుందని సమాచారం. దీంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల గండి పడుతున్నది.

Also Read: Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

Just In

01

Sankranti Safety Alert: పతంగులు ఎగురవేస్తున్నారా? జర భద్రం.. విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ కీలక సూచనలు!

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు.. కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ?

Mega Blockbuster: సంక్రాంతికి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’..

Rahul IAS: తన వెడ్డింగ్ కార్డ్ నే కాదు.. ఇప్పుడు కొడుకు పేరున రిలీజైన త్రీడీ వీడియో రివ్యూ నెట్టింట వైరల్.. ఎవరా ఐఏఎస్ ఆఫీసర్?

Naari Naari Naduma Murari Review: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’.. ఫుల్ రివ్యూ