Private Hospitals: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులు
Private Hospitals (imaghecredit:twitter)
రంగారెడ్డి

Private Hospitals: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులు.. పర్మిషన్ ఒక చోట.. నిర్వహణ మరో చోట..!

Private Hospitals: నిబంధనలు పాటించని ఆసుపత్రులు
-బిల్డింగ్ పర్మిషన్ ఒక చోట.. నిర్వహణ మరో చోట
-ఒకే ఆసుపత్రి పై పేర్లు మార్పుతో డబుల్ రిజిస్ట్రేషన్
-తనిఖీల పేరుతో వసూళ్లు జరిగేనా
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: అనుమతులు సులభం.. నిబంధనల నిర్వహణ శూన్యం. ఈ పద్ధతి ఎక్కడో కాదు.. రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని ప్రయివేట్, కార్పొరేట్ ఆసుపత్రిల్లో నడుస్తుంది. నిబంధనలతో పనిలేదు, ప్రజల అవసరాలను సొమ్ముగా చేసుకొని వైద్యం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యవహారాల పై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు గతంలో పనిచేసిన వైద్యాధికారి ఆగడాలు అంతా ఇంత కాదు… ఆ ఆగడాలకు ఇప్పుడైనా చెక్ పడుతుందా అని బాధితులు ఎదురుచూస్తున్నారు. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖ లో అధికారిని నడిపించే వ్యక్తి ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి వ్యావహారశైలితోనే ఆ శాఖ బ్రష్టు పడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సగం ఆసుపత్రుల్లో నిబంధనలుండవ్…

అర్హత కలిగిన వైద్యులు తప్ప… మిగిలిన ఏ నిబంధనలు ఉండవ్. అద్దె భవనాల్లో అగ్రిమెంట్లు, సొంత భవనాలకు మున్సిపాలిటీ అనుమతి, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, పొల్యూషన్ బోర్డు నిబంధనలు ఒక్కటి కూడా ప్రామాణికంగా పాటించని ఆసుపత్రులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఆసుపత్రులు.. పనిచేయని వాటిపై నిఘా పెట్టిన సందర్భాలు తక్కువ. ఇంకా క్లినిక్ ల దందా చెప్పలేని వ్యవస్థ. ప్రజా కోణంలో కాకుండా కేవలం కార్పొరేట్, ప్రయివేట్ యాజమాన్యం కోణంలో జిల్లా వైద్యాధికారులు పనిచేస్తున్నారని సమాచారం. ఆ యాజమాన్యానికి అధికారులకు మధ్య ఓ ఉద్యోగి నేతృత్వంలో బ్రోకరిజం నడుస్తుందని జిల్లా అంతా ప్రచారంలో ఉంది. ఆ బ్రోకర్ చేసే పనులతో నిబంధనలకు అనుగుణంగా నడిపించే సామాన్య వైద్యులకు ఇబ్బంది జరుగుతుంది. ప్రస్తుత జిల్లా వైద్యాధికారి కూడా ఆ ఉద్యోగి సూచనలతో ముందుకు వెళ్తుందా, సొంత ఆలోచనతో అడుగులు వేస్తుందా వేచిచుడాల్సి ఉంది.

Also Read: Travel Advice: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా!.. పోలీసులు చెప్పిన ఈ సూచనలు పాటించారా లేదా మరి?

తనిఖీలతో న్యాయం జరిగేనా..?

జిల్లా వైద్యాధికారి త్వరలో ప్రతి ఆసుపత్రిని తనిఖీలు చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే వైద్యుడి విద్యార్హత పత్రం, సహా మున్సిపాలిటీ నుంచి పొందిన బిల్డింగ్‌ పర్మిషన్లు, ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్‌, బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ కోసం పొల్యూషన్‌ కంట్రో ల్‌ బోర్డు నుంచి పొందిన అనుమతి పత్రాలను పరిశీలించనుంది. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా..ఆయా ఆస్పత్రులను సీజ్‌ చేయాలని నిర్ణయించింది. తనిఖీల్లో భాగంగా కన్సల్టెన్సీ, చికిత్సలకు సంబంధించిన ఫీజుల ఛార్ట్‌ను పరిశీ లించనున్నట్లు సమాచారం. వీటిని సక్రమంగా తనిఖీలు చేస్తే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం కలుగుతుంది. లేకపోతే అనుమానాలకు తావునిస్తుంది. గతంలో వచ్చిన పిర్యాదుల ఆధారంగా వసూళ్లు చేసినా ఘనమైన పేరుంది. ఇప్పుడు కూడా తనిఖీల పేరుతో వసూళ్లు జరుగుతాయానే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏ రక్షణ లేని క్లినిక్లు..

జిల్లాలో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ, జనరల్‌ నర్సింగ్‌ హోమ్స్‌ సహా ఫెర్టిలిటీ సెంటర్లు, డెంటల్‌ క్లినిక్‌లు, కన్ను, చెవి, ముక్కు(ఈఎన్‌టీ), ఆప్తమాలజీ, స్కిన్‌కేర్‌ క్లినిక్‌లు 3,136 వరకు ఉన్నాయి. వీటితో పాటు మరో 834 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా బస్తీల్లో, మారుమూల మండల కేంద్రాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు ఉన్నాయి. అక్రమ నిర్మాణాల్లోనే మెజార్టీ ఆస్పత్రులు, క్లీనిక్‌లు కొనసాగుతున్నాయి. కనీస భద్రత, మౌలిక సదుపా యాలు లేని నిర్మాణాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఆయుర్వేద, యునానీ వైద్యులు..అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతున్నారు. కనీసం పన్నెండు కూడా పాస్‌కానీ వాళ్లు..ఎంబీబీఎస్‌ వైద్యులుగా చలామణి అవుతున్నా రు. ప్రిస్కిప్షన్లు రాయడంతో పాటు ఏకంగా సర్జరీలు చేసేస్తున్నారు. మరికొంత మంది ఏకంగా అవయవ మార్పిడి చికిత్సలు చేస్తూ బాధితుల మృత్యువాతకు కారణమవుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఫెర్టిలిటీ, సరోగసి, స్పెర్మ్‌ స్టోరేజీ కేంద్రాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. సంపాదనే లక్ష్యంగా కొన్ని డయాగ్నోస్టిక్స్‌ కడుపులో ఉన్నది ఆడో, మగో ముందే చెప్పేస్తున్నాయి. అబా ర్షన్లను ప్రోత్సహిస్తూ పరోక్షంగా భ్రూణహత్యలకు కారణమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇవన్నీ ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వైద్యాదుకారులు తీసుకునే చర్యలతో మార్పు వస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

Also Read: Mahabubabad Police: మహబూబాబాద్‌లో.. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్..!

Just In

01

Black Jaggery: యథేచ్చగా నల్ల బెల్లం దందా.. పోలీసులు విధులు నిర్వహిస్తారా? భేరసారాలకు తావిస్తారా?

Cheekatilo Trailer: శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ సినిమా ట్రైలర్ వచ్చింది చూశారా?

Malla Reddy: రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? తాగునీటి ఎద్దడిపై మల్లారెడ్డి ఫైర్!

TG Road Accidents: తెలంగాణలో రక్తంతో తడుస్తున్న రోడ్లు.. వామ్మో రోజుకు ఇన్ని మరణాలా..?

Venezuela – Trump: వెనిజువెలా అధ్యక్షుడిని నేనే.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!