Mahabubabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్..!
Mahabubabad Police (imaecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad Police: మహబూబాబాద్‌లో.. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్..!

Mahabubabad Police: మహబూబాబాద్ పట్టణ పరిధి, శివారు కలెక్టర్ కార్యాలయం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పై సీఐ గట్ల మహేందర్ రెడ్డి(CI Gatla Mahender Reddy) ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆదివారం కావడంతో జల్సాలకు అలవాటు పడే యువత మద్యం సేవిస్తారనే కోణంలో వాటిని అరికట్టేందుకు రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలతో పాటు ఇతర వాహన డ్రైవర్ల అందరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ప్రమాదాల శాతం

సాయంత్రం నుంచి రాత్రి సమయంలో ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో సీఐ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఎస్సై షకీర్, గ్లూకోల్ట్ సిబ్బందితో కలిసి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడంతోపాటు జరిమానాలు సైతం విధించారు. వాహనాలు నడిపి సమయంలో మద్యం సేవించవద్దని హెచ్చరించారు. పండుగల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు చేరుకునేందుకు వివిధ వాహనాల్లో ప్రయాణాలు సాగించే వారు మద్యం సేవించవద్దని స్పష్టం చేశారు. మద్యం సేవించడం వల్ల ప్రమాదాల శాతం పెరగడంతోపాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. పండుగ వేళ కుటుంబాలతో సంతోషంగా గడపాలంటే వాహనాలను నడిపే సమయంలో మద్యం సేవించొద్దని వివరించారు.

Also Read: Palwancha Municipality: పాల్వంచ మున్సిపాలిటీలో ఈసారైనా పోరు జరిగేనా..? అందరి చూపు అటువైపే..!

బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు

అక్రమ గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అరికట్టేందుకు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలను చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల బ్యాగులను, సంచులను నిషితంగా పరిశీలించారు. మహబూబాబాద్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సంక్రాంతి పండుగకు ముందుగా ముందస్తు తనిఖీలను నిర్వహించారు. అసాంఘిక శక్తుల ను అరికట్టేందుకు స్పెషల్ చెకింగ్ చేశారు. దొంగతనాలు, చోరీలకు సంబంధించిన పాత నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించారు. చోరీలు చేసిన వారు ఏమైనా విక్రయాలు జరిపేందుకు ఇతర ప్రాంతాలకు బంగారు నగలను తీసుకెళ్తున్నారా…? అనే కోణంలోనూ తనిఖీలు చేపట్టారు.

Also Read: Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Just In

01

Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!

Azharuddin: త్రిశంకు స్వర్గంలో అజారుద్దీన్.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం

MSG Movie Review: సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను నవ్వించారా?.. ఫుల్ రివ్యూ..

Mahabubabad Police: మహబూబాబాద్‌లో.. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్..!

Chinese Manja: రహదారుల్లో యమపాశం.. చైనా మాంజాతో ఒకే రోజు ముగ్గురికి తీవ్ర గాయాలు