Rahul IAS: తన వెడ్డింగ్ కార్డ్ నే కాదు. ఇప్పుడు కొడుకు పేరున రిలీజైన త్రీడీ వీడియో రివ్యూ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎవరా ఐఏఎస్ ఆఫీసర్? ఏమిటా అదృత్ హవన్ ” పేరులో గొప్పతనం ? ఏమిటా స్పెషల్ అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ప్రత్యేక కథనం తప్పక చదవాల్సిందే రాహుల్ నామంలోనే ఉంది అర్ధం కార్య సాధకుడు అని. అన్నింటా అయన స్పెషలే. ప్రజారంజకమైన పాలన,ఆదర్శవంతమైన జీవితం అడుగడుగునా సుస్పష్టం. సతీమణితో ప్రేమ ప్రయాణం మొదలుకొని, తనయుడి నామకరణోత్సవం వరకు ఆయనవీ అన్నింట అద్భుత మజిలీలే.
ఈ ఐఏఎస్ లవ్ జర్నీ
ఆ వీడియోలో వైరల్ కాగా, తనయుడి నామకరణోత్సవం సందర్భంగా వినూత్న రీతిలో కొడుకు పేరు రివ్యూ చేస్తూ ఐఏఎస్ రాహుల్ రూపొందించిన తాజా త్రీడి వీడియో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతాభివృద్ధికి కంకణం కట్టుకుని పని చేస్తున్న ఈ ఐఏఎస్ కుటుంబాన్ని పలువురు అభినందిస్తున్నారు.
ఐటీడీఏ పీవో రాహుల్ రోల్ మోడల్
భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ ఐఏఎస్ అన్నింట ఒక రోల్ మోడల్ అని అందరికీ తెలిసిందే. ఐఏఎస్ సాధన మొదలు, ఆదర్శవంతమైన పాలనకు ఆయన చెమటోడ్చిన తీరు అడుగడుగు ఆదర్శం. భద్రాచలం ఐటీడీఏ పీవోగా గిరిజనాభివృద్ధికి ఆయన చేసిన మేలు అంతా ఇంతా కాదు. ప్రధానంగా అయన ట్రైబల్ మ్యూజియం ఆధునికీకరణ సృష్టికర్త. ఇదంతా సజీవ చరిత్ర. వ్యక్తిగత జీవితంలో కూడా రాహుల్ ఐఏఎస్ కు ప్రత్యేక శైలి ఉంది. ప్రతి అంశము ఆదర్శప్రాయమే.తన సతీమణికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేపించి ఏజెన్సీ ప్రజలలో మనోధైర్యాన్ని నింపిన తీరు ముదావహం.
రాహుల్ వంశోద్ధారకుడు అదృత్ హవన్
ఐఏఎస్ రాహుల్, తన సతీమణి మనీషాతో వివాహం నుంచి తనయుడి జననం, నామకరణం వరకు జీవితంలో ప్రత్యేక ఘట్టాలతో కూడిన ఒక వీడియోను ఇటీవల రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన సతీమణితో ప్రేమ పర్యటన, వేద స్తోత్రాలతో, సమస్త కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో పరిణయ రూపాలు, భారతావని స్వాతంత్ర్యం సాధించిన మహోన్నత పర్వదినాన వారసుడి ఆగమనం, అనుభూతి తెలుపుతూ సాక్షాత్తు ఐఏఎస్ రాహుల్ వ్యాఖ్యానం ఈ వీడియోలో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
తన తల్లి కొలిచే వెంకటఅద్రిలోని కొలువైన వేంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పవిత్ర యజ్ఞ కుండంలోకి వెళ్ళగా, కుటుంబ దైవం యాదఅద్రిలో నెలవైన నరసింహస్వామి కరుణ కటాక్షములు పావనమైన యాగ కలశంలోకి అడిగిడగా, నాన్న ఆరాధించే మరియు ఆయువు పోసుకున్న భద్రఆద్రిలో వెలిసిన సీతారాముల స్వామి దీవెనలు స్వచ్ఛమైన హోమ ఘటంలోకి ప్రవేశించగా ఈ మూడు అద్రుల మూలావతార పురుషుడు సాక్షాత్తు విష్ణు భగవానుడి అనుగ్రహంతో వెదజిల్లుతున్న ఆ హవనమే మా’అదృత్ హవన్” అని రాహుల్ ఐఏఎస్ ఈ సందర్భంగా ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. అద్రులు(కొండలపై) వెలిసిన 3 విష్ణు దేవుడి అవతారాల స్ఫూర్తితో విష్ణు సహస్రనామాల్లో నుంచి తీసుకున్న నామమే అదృత్ అని, అనగా సమర్థవంతుడు, స్వతంత్రుడు, అద్భుతమైన వాడు అని రాహుల్ ఐఎఎస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన వివాహ సందర్భంగా కూడా గతంలో తన వివాహం సందర్భంగా కూడా ఐఏఎస్ రాహుల్ రూపొందించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో నాడు తెగ వైరల్ అయింది.

