Illegal Soil Mining: దర్జాగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు
అనుమతి లేనిదే మట్టి తవ్వకాలు
పండుగ రోజు అధికారులు ఎవరు అందుబాటులో ఉండరు అని తవ్వకాలు
చేవెళ్ల మండలంలోని బస్తేపూర్ రెవిన్యూ(Bastepur Revenue) పరిధిలో స్మశాన వాటిక దగ్గర మూడు ట్రాక్టర్, ఒక జేసీబి(JCB)తో ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా మట్టిని తవ్వతూన్నారు. బుధవారం బోగి పండుగ అధికారులు ఎవరు ఉండరు మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టు దర్జాగా మట్టి తవ్వుతున్నారు. గ్రామ పెద్దలే దెగ్గర ఉండి మట్టి తవ్వుతున్నారు అని సమాచారం. గత వారంరోజుల క్రితం ఇలాగే మట్టి తవ్వితే తహసీల్దార్(MRO) కు గ్రామస్థులు పిర్యాదు చేయగా స్థానిక పోలీసుల సహాయంతో జేసీబి(JCB)ని, ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకునట్టు సమాచారం. తిరిగి మళ్ళీ రోజు కూడా అక్రమంగా మట్టి తవ్వుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకువాలని స్థానికులు కోరుకుంటున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
అక్రమంగా మట్టి తవ్వుతున్న నాకు సమాచారం వచ్చిందని తహసీల్దార్ కృష్ణయ్య తెలిపారు. ఈ రోజు సెలవు కావడంతో అందుబాటులో లేను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చానని ఆయన అన్నారు. అక్రమానికి పాల్పడిన వారిపై వెంటనే చట్టంపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: AEO Workload Issues: పని భారంతో ఏఈవోలు సతమతం.. విజ్ఞప్తులు చేసిన ఉన్నతాధికారులు నో రెస్పాన్స్!

