మూవీ: నారీ నారీ నడుమ మురారి
నటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, తదితరులు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
విడుదల : జనవరి 14, 2026.
Naari Naari Naduma Murari Review: ఈ సంక్రాంతికి వచ్చిన అయిదు సినిమాలో చివరిగా వచ్చిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. శర్వానంద్ ఈ సినిమాలో పూర్తి స్థాయి వినోదాన్ని అందించారు. ‘సామజవరగమన’ ఫేం దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే చాలా రోజుల తర్వాత నవ్వించడారికి వచ్చిన శర్వానంద్ ప్రేక్షకులను నవ్వించాడా? అసలు కథేంటి? అన్నది ఈ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
కథాంశం
గౌతమ్ తన ప్రాణంగా ప్రేమించిన నిత్య (సాక్షి వైద్య) ను పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరి ప్రేమకు నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్) మొదట అడ్డు చెప్పినా, చివరకు ఒక వింత షరతుతో ఒప్పుకుంటాడు. ఆ పెళ్లి ఆడంబరంగా కాకుండా కేవలం రిజిస్టర్ ఆఫీస్‌లోనే జరగాలని ఆయన పట్టుబడతాడు. నిత్య కోసం గౌతమ్ అందుకు అంగీకరిస్తాడు. అయితే, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో గౌతమ్ జీవితంలోకి ఊహించని సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యకు, గతంలో అతడు కాలేజీలో ప్రేమించిన దియా (సంయుక్త) కు ఉన్న లింక్ ఏంటి? అసలు వారిద్దరూ ఎందుకు విడిపోయారు? అనేది కథలో కీలక మలుపు.
Read also- Polaki Vijay: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ వేళ.. విజయ్ పొలాకి మరోసారి ఎమోషనల్ పోస్ట్!
విశ్లేషణ
వినూత్నమైన పాత్రలు, బలమైన కామెడీతో సాగే ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచుతుంది. అరవై ఏళ్ల తండ్రికి పాతికేళ్ల అమ్మాయితో హీరో పెళ్లి చేసే క్రేజీ ఎపిసోడ్‌తోనే సినిమా మూడ్‌ను సెట్ చేసిన దర్శకుడు, ఆపై గౌతమ్-నిత్యల లవ్ ట్రాక్‌ను ఆసక్తికరంగా నడిపించారు. రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే మలుపులు, గతానికి సంబంధించిన బ్రేకప్ స్టోరీని ప్రస్తుత పెళ్లితో ముడిపెట్టిన తీరు ప్రథమార్ధంలో ఆకట్టుకోగా, ఇంటర్వెల్ సీన్స్ ద్వితీయార్ధంపై అంచనాలను పెంచుతాయి. ఇక ద్వితీయార్ధంలో ఎదురయ్యే సవాళ్లను దర్శకుడు మరింత హాస్యభరితంగా తీర్చిదిద్దారు. ఆఫీసులో మాజీ ప్రేయసి టీమ్ లీడర్‌గా రావడం, విడాకుల డ్రామా, ఒక తప్పును కవర్ చేయడానికి హీరో పడే తిప్పలు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ సినిమాకు అదనపు బలాన్ని ఇవ్వగా, ప్రీ-క్లైమాక్స్‌లో కాస్త భావోద్వేగాలు పండించి, చివరకు క్లైమాక్స్‌ను వినోదాత్మకంగా ముగించడంతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి సంతృప్తిని ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఈ సంక్రాంతికి ఇద్ద రమ్మాయిలమధ్య నలిగిపోయే హీరో కథలు ఇప్పటికే వచ్చాయి. మళ్లీ వచ్చిన ఈ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్రస్టేటెడ్ బాయ్‌ఫ్రెండ్‌గా గౌతమ్ పాత్రలో శర్వానంద్ పూర్తిగా నవ్వించాడు. శర్వానంద్ లుక్స్ పరంగా చాలా కొత్తగా కనిపించాడు. సాక్షి వైద్య – సంయుక్తతో శర్వానంద్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. శర్వా తర్వాత ఈ చిత్రానికి మరో హీరో నరేశ్. ముఖ్యంగా సీమంతం ఎపిసోడ్.. ద్వితీయార్ధంలో కోర్టు సీక్వెన్స్‌లో తన నటన ఆద్యంతం ఉంటుంది. ఇక తనకు జీవితాన్నిచ్చిన గురువుని విపరీతంగా ఆరాధించే వ్యక్తిగా గుణశేఖర్ పాత్రలో వెన్నెల కిశోర్ నటన.. ప్రేమ జంటల్ని కలిపే లవకుశగా సత్య చూపే ఫ్రస్టేషన్ అలరిస్తాయి. భాను భోగవరపు రాసుకున్న ట్రెండీ కథ.. దానికి తగ్గట్లుగా నందు పేల్చిన వన్‌లైనర్లు.. దీన్ని అంతే చక్కగా మంచి స్క్రీన్‌ప్లేతో రామ్ అబ్బరాజు తెరపైకి తెచ్చిన తీరు మెప్పిస్తాయి. అతిథి పాత్రలో శ్రీవిష్ణు చేసిన సందడి అలరిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా కుదిరింది. జ్ఞానశేఖర్, యువరాజ్‌ల విజువల్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మెప్పించేలా ఉన్నాయి.
Read also-Nidhhi Agerwal: పవర్ స్టార్, రెబల్ స్టార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే..
బలాలు
- కథ
- శర్వానంద్, నరేశ్‌ల
- కామెడీ
బలహీనతలు
- ప్రథమార్ధం
రేటింగ్- 3.25 /5

