Polaki Vijay: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నామస్మరణతో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం ప్రభంజనం సృష్టిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ గ్రేస్, ఆయన మేనరిజమ్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘హుక్ స్టెప్’తో పాటు, సినిమాపై మొదటి నుంచి హైప్ తెచ్చిన ‘మీసాల పిల్ల’ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ థియేటర్లలో ఈలలు, గోలలతో మారుమోగిపోతున్నాయి. ఈ పాటను కంపోజ్ చేసిన టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి (Polaki Vijay), తన ఆరాధ్య దైవంతో కలిసి పనిచేసిన అనుభూతిని పంచుకుంటూ పెట్టిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పోస్ట్‌లో ఏముందంటే..
Also Read- Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!
ఆ వీణ స్టెప్ స్ఫూర్తి
‘‘నేను పెరిగే క్రమంలో మెగాస్టార్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తూ ముగ్ధుడిని అయ్యాను. ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి ఫ్రేమ్ నేను కొరియోగ్రాఫర్ కావాలనే నా కలను నిర్దేశించాయి. ముఖ్యంగా మెగాస్టార్ ఐకానిక్ ‘వీణ స్టెప్’ అనేది కేవలం ఒక మూవ్ మాత్రమే కాదు, నా చిన్నతనంలో డ్యాన్స్ పట్ల నాకు కలిగిన ఇన్‌స్పిరేషన్’’ అని విజయ్ పొలాకి తన పోస్ట్‌లో చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఒకప్పుడు టీవీలో చిరంజీవి డ్యాన్స్ చూసి మురిసిపోయిన విజయ్, నేడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం స్వయంగా ఆయనకే స్టెప్స్ కంపోజ్ చేయడం ఒక అద్భుతమని చెప్పుకొచ్చారు. ‘‘ఎంపరర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవితో కలిసి ‘మీసాల పిల్ల’ సాంగ్ కోసం పని చేయడం, ఆయనకు ఆ ఐకానిక్ స్టెప్స్ కంపోజ్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని వరం. నా కల నెరవేరిన ఈ క్షణం నా జీవితంలో అత్యంత విలువైనది’’ అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
Also Read- Rithu Chowdary: వాళ్లిద్దరి కంటే ముందు.. నేను చనిపోవాలని కోరుకుంటా!
శిరస్సు వంచి కృతజ్ఞతలు
ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవికి విజయ్ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను నమ్మి ఈ బాధ్యతను అప్పగించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ‘నాపై నమ్మకం ఉంచి, ఈ అద్భుతమైన ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని రాసుకొచ్చారు. సినిమా ఇప్పటికే సంచలన విజయం సాధించి, పాటలు చార్ట్‌బస్టర్స్ అయిన తరుణంలో విజయ్ పొలాకి చేసిన ఈ పోస్ట్, ఒక సాధారణ అభిమాని మెగాస్టార్ మనసు గెలుచుకుని, ఆయనతోనే స్టెప్స్ వేయించే స్థాయికి ఎదిగిన ఇన్సిస్పిరేషనల్ జర్నీని చాటిచెబుతోంది. ఇంతకు ముందు మెగాస్టార్ బర్త్‌డేని పురస్కరించుకుని విజయ్ పొలాకి చేసిన పోస్ట్ ఎలా వైరల్ అయిందే తెలియంది కాదు. ఇప్పుడు మరోసారి తన కృతజ్ఞతను ఆయన తెలియజేశారు.
I grew up watching his dance moves…
Every frame, every step shaped my dream of becoming a dancer.
The iconic Veena Step of Mega Star @KChiruTweets garu was not just a move it was an inspiration that lived in my childhood ❤️Today recreating that iconic step with the Man himself… pic.twitter.com/yNCRO6yLHV
— Polaki Vijay (@PolakiVijay) January 14, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

