Rithu Chowdary: వాళ్లిద్దరి కంటే ముందు.. నేను చనిపోవాలి!
Rithu Kissik Talks With Varsha (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Rithu Chowdary: వాళ్లిద్దరి కంటే ముందు.. నేను చనిపోవాలని కోరుకుంటా!

Rithu Chowdary: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగు పెట్టి, తన నవ్వుతో అందరి మనసును దోచుకున్న బ్యూటీ రీతూ (Rithu). చివరిలో ఎలిమినేట్ అయినప్పటికీ, ఉన్నన్ని రోజులు మంచి కంటెంట్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా యూత్ ఈ షో‌కు ఆకర్షితులవడానికి కారణంగా మారిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ షో‌లో ఆమె తీరు, ఈ షోకు రాక ముందు ఆమెపై ఉన్న ఆరోపణలను బట్టి.. ఆమెను జడ్జి చేసే వారికి, రీతూ తనలోని రెండో కోణాన్ని తెలియజేసింది. బిగ్ టీవీలో ప్రసారమయ్యే పాపులర్ టాక్ షో ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Kissik Talks With Varsha)కు ఆమె గెస్ట్‌గా హాజరై, తన లైఫ్‌లోని ఎన్నో హార్ట్ టచ్చింగ్ విషయాలను తెలియజేశారు. ఈ షో‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యాంకర్ వర్ష తనదైన శైలిలో రీతూను ఆటపట్టిస్తూనే, ఆమె జీవితంలోని భావోద్వేగ అంశాలను ఈ ఇంటర్వ్యూలో వెలికితీశారు. ఈ ప్రోమోని గమనిస్తే..

Also Read- Mega Family: మెగా ఇంట మొదలైన సంక్రాంతి సందడి.. ‘భోగి’ స్పెషల్ వీడియో వచ్చేసింది

నవ్వులతో మొదలై.. కన్నీళ్లతో ముగిసిన ప్రోమో

ప్రోమో ఆరంభంలో వర్ష, రీతూల మధ్య సరదా సంభాషణ సాగింది. రీతూను ‘డెమోన్’ (Demon) అని పిలుస్తూ వర్ష ఆటపట్టించగా, రీతూ కూడా అంతే సరదాగా బదులిచ్చారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా రీతూ నవ్వుకి పడిపోయారని ఆమె ఇందులో చెబుతోంది. ఆమె నవ్వులో ఏదో మ్యాజిక్ ఉందని వర్ష ప్రశంసించారు. అయితే, ఇంటర్వ్యూ సాగుతున్న కొద్దీ బిగ్ బాస్ హౌస్‌లో రీతూ ఎదుర్కొన్న చేదు అనుభవాలు, బయట ఆమె కుటుంబం అనుభవించిన నరకం వంటి విషయాలు చర్చకు వచ్చాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో తనకు ఏమీ తెలియదని, కానీ తన వల్ల తన తల్లి చాలా ఇబ్బందులు పడిందని రీతూ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేశారని, ఓట్ల కోసం తన తల్లి ఫోన్ చేసినప్పుడు కూడా కొందరు సభ్యత లేకుండా మాట్లాడారని చెబుతూ రీతూ కన్నీరు పెట్టుకున్నారు. ఏ ఆడపిల్లకూ ఇటువంటి పరిస్థితి రాకూడదు అని ఆమె ఎమోషనల్ అయ్యారు. తల్లి ముందు ధైర్యంగా ఉంటూనే, బాత్‌రూమ్‌లోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చేదాన్నని రీతూ చెప్పిన మాటలు ఎమోషనల్‌గా టచ్ చేస్తున్నాయి. డిమాన్‌ను వాడుకుంటున్నారని, ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అని చేసిన ఎలిగేషన్స్ తనను చాలా బాధించాయని ఆమె పేర్కొన్నారు.

Also Read- Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు.. అనసూయ షాకింగ్ పోస్ట్

శివుడిని కోరుకునే కోరిక అదే..

సోషల్ మీడియా ట్రోలర్స్ గురించి రీతూ ఘాటుగా స్పందించారు. నెట్టింట బూతులు తిడుతూ, బ్యాడ్ కామెంట్స్ చేసేవారే బయట కనిపిస్తే ‘రీతూ అక్క.. నేను నీ పెద్ద ఫ్యాన్‌ని’ అని సెల్ఫీలు అడుగుతారని, ఈ ద్వంద్వ నీతి తనకు నచ్చదని విమర్శించారు. అలాగే, తనను కావాలని టార్గెట్ చేసిన వారికి కర్మ తప్పకుండా బుద్ధి చెబుతుందని, తాను దేవుడిని (శివుడిని) నమ్ముతానని స్పష్టం చేశారు. ఇలా ఆసక్తికరంగా నడుస్తున్న ఇంటర్వ్యూలో ప్రోమో చివరిలో వర్ష ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘ఒకవేళ శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే ఏం అడుగుతావు?’ అని అడగ్గా.. ‘మా అమ్మ, అన్నయ్య కంటే ముందు నన్నే తీసుకెళ్లిపోమని కోరుకుంటా’ అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. తను లేకపోతే తన కుటుంబానికి ఎవరూ లేరని, ఆ బాధను తాను చూడలేనని రీతూ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేస్తోంది. మొత్తానికి, రీతూ చౌదరిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన ఈ పూర్తి ఎపిసోడ్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!

Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!

BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అద్భుతంగా రావడానికి కారణం ఎవరంటే?

Khammam Police: ఖమ్మం జిల్లాలో కోడి పందేల స్థావరాల స్థావరాలపై.. డ్రోన్‌ కెమెరాల సహాయంతో పోలీసుల నిఘా!

Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. 290 కోట్లతో నేతన్నకు చేయూత : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!