Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి..
Chiru MSG party (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!

Chiranjeevi MSG Party: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా వచ్చిన మెగా ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో అద్భుతమైన జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయి చేరుకుంది. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో ఒక గ్రాండ్ పార్టీ (Chiranjeevi MSG Party)ని ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read- Mega Family: మెగా ఇంట మొదలైన సంక్రాంతి సందడి.. ‘భోగి’ స్పెషల్ వీడియో వచ్చేసింది

వెంకీ మామ రచ్చ రచ్చ

మంగళవారం సాయంత్రంతో మొదలైన ఈ పార్టీని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కూడిన వేడుకకు వెంకటేష్ (Victory Venkatesh), రామ్ చరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలతో పాటు సినిమాకు భాగమైన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో కేక్ కటింగ్ చేసి మరోసారి చిరు, వెంకీ అల్లరల్లరి చేశారు. ముఖ్యంగా వెంకీమామ ఈ వీడియోలు మాములు హ్యాపీగా లేరు. యూనిట్ మొత్తంలో జోష్ నింపుతున్నారు. సినిమాలో చిరుతో కలిసి రచ్చ రచ్చ చేసిన వెంకీ, ఈ పార్టీలోనూ కేక్ కట్ చేసే సమయంలో మరోసారి రచ్చ మొదలెట్టారు. వారిద్దరి స్నేహం, ఆనందం చూసిన వారికి కడుపు నిండిపోయిందంటే అతిశయోక్తి కానే కాదు. అలా అని విందు ఏమీ లేని అనుకోవద్దు సుమీ..

Also Read- Nidhhi Agerwal: మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది.. ‘రాజా సాబ్’పై నిధి!

ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్

కేక్ కటింగ్ అనంతరం చిత్ర బృందానికి మెగాస్టార్ అద్భుతమైన విందును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. నవ్వులు, కృతజ్ఞతలు, ఆత్మీయ సంభాషణలతో వేడుక కన్నుల పండవలా సాగింది. సినిమా ఘన విజయానికి కారణమైన ప్రతి సభ్యుడికి చిరంజీవి స్వయంగా కృతజ్ఞతలు తెలపడం విశేషం. ముఖ్యంగా ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లుగా ఈ వీడియో తెలియజేస్తుంది. వెంకీమామను ఆయన రిసీవ్ చేసుకున్న తీరు, ఇద్దరూ కలిసి ఎంతో ప్రేమగా పలకరించుకున్న విధానం అంతా కూడా మెగా విక్టరీ ఫ్యాన్స్‌ను మరోసారి హ్యాపీ మూడ్‌లోకి తీసుకెళ్లింది. ఈ వేడుకను విజయోత్సవంగా మాత్రమే కాకుండా ముందస్తు భోగి, సంక్రాంతి సంబరాలుగా ఆనందంగా జరుపుకున్నారు. సక్సెస్‌తో వచ్చే ఆనందం ఇలా ఉంటుందని, ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Polaki Vijay: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ వేళ.. విజయ్ పొలాకి మరోసారి ఎమోషనల్ పోస్ట్!

Yellamma: ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ రెడీ.. దేవి శ్రీ ప్రసాద్ అరాచకం అంతే..!

Nidhhi Agerwal: పవర్ స్టార్, రెబల్ స్టార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే..

Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!

Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!