BJP Vs Congress: హిందువులపై బీజేపీ కుట్ర
రామరాజ్యం కోసం గాంధీ కలలు
ఆర్ఎస్ఎస్ హత్య
మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: భగవద్గీత నమ్మే గాంధీపై బీజేపీ వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్లో మాట్లాడిన ఆయన బీజేపీపై విమర్శలు (BJP Vs Congress) గుప్పించారు. హిందువులపై బీజేపీ కుట్ర చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం మరోకటి లేదన్నారు. రామరాజ్యం కోసం కలలుగన్న గాంధీని హత్య చేసింది ఆరెస్సెస్ అని, ఇప్పుడు గాంధీ పేరును తొలగించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా హిందువులను అవమానించేలా ఉన్నాయన్నారు. రాముడి పేరుతో హిందువులపై బీజేపీ నేతలు హైడ్రోజన్ బాంబు వేస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరుతో పాటు పథకమే తొలగించాలని బీజేపీ కుట్ర పన్నిందన్నారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో పని చేసే వారందరూ హిందువులేనని వెల్లడించారు. గతంలో బ్రిటిషర్లు, ఇప్పుడు బీజేపీ నేతలు తప్పా..ప్రపంచంలో అందరూ గాంధీని కీర్తిస్తారన్నారు. రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే గాంధీ సిద్ధాంతం అంటూ సామా వివరించారు.
Read Also- Telangana Cold Wave: ఈ సీజన్లోనే కనిష్ఠం.. తెలంగాణలో శనివారం ఉదయం అత్యుల్ప ఉష్ణోగ్రతలు
గాంధీని హత్య చేసినప్పుడు ఛాతీలో బుల్లెట్లు తగిలినా హేరామ్ అంటూనే గాంధీ నేలకొరిగారని గుర్తు చేశారు. గాంధీ పేరును మార్చాలనే ఆలోచన వచ్చేది బ్రిటిష్ వాడికేనని, బీజేపీ నేతల్లో కనిపించని బ్రిటీష్ ఆలోచనలుఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో ఉపాధి హామీ కోసం 53 లక్షల మంది జాబ్ కార్డు హోల్డర్లు ఉన్నారని, గత సంవత్సరం 12 కోట్ల పనిదినాల నుండి కేవలం 6.5 కోట్ల పని దినాలకు కుదించినట్లు వెల్లడించారు. మోదీ కొత్త చట్టంలోని 125 రోజుల గ్యారెంటీ పని దినాల ప్రకారం తెలంగాణలో కేవలం 10 రోజులు మాత్రమే పని ఇవ్వగలరని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం తెలంగాణలో 40 శాతం భారాన్ని వేస్తూ కేంద్రం చేతులు ఎత్తేస్తుందన్నారు. బీజేపీ రాజకీయాలు చూసే రాముడు అయోధ్యలో ఆ పార్టీని ఒడగొట్టాడన్నారు.
కేంద్రంపై టీసీసీ చీఫ్ మండిపాటు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ గాంధీ పేరు వింటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టాన్ని తీసుకురావడానికి వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, పేదవారికి రెండు పూటలా అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించిందని గుర్తుచేశారు. ఈ పథకానికి జాతిపిత మహాత్మా గాంధీ పేరే సరైనదని భావించి పేరు పెట్టారని, కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాలని చూస్తోందని, దీన్ని ఎంతమాత్రం సహించమని శ్రీధర్ బాబు అన్నారు.

