RTC Bus Accident: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలంలో గురువారం ఉదయం భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పరందోలి ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు(Brakes Fail) అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి బస్సును లోయలోకి పడిపోకుండా నియంత్రించి, పక్కనే ఉన్న పత్తి చేనులోకి మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఈ బస్సు పరందోలి నుండి మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ వైపు వెళ్తోంది. దాదాపు 200 మీటర్ల ఎత్తులో ఉండే పరందోలి ఘాట్ సెక్షన్ వద్దకు రాగానే బస్సు బ్రేకులు పని చేయకుండా పోయాయి.
రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి..
ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, బస్సు లోయలోకి దూసుకెళ్లకుండా చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి మళ్లించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలవ్వగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను వారు కృతజ్ఞతలతో అభినందించారు.
లోయలోకి దూసుకెళ్లిన బస్సు
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు
ఈ ఘటనలో 30 మంది గాయాల పాలైనట్లు సమాచారం
బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును పత్తి చేను వైపు తీసుకెళ్లిన డ్రైవర్
ప్రమాద సమయంలో బస్సులో 40… pic.twitter.com/lddscU7skk
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2025
Also Read: Cyber Posters Launch: ఆన్ లైన్ అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి: ఎస్పీ డా. పి.శబరీష్

