Asim Munir - Trump: ఆసీం మునీర్‌కు ట్రంప్ అగ్నిపరీక్ష
Asim Munir - Trump (Image Source: Twitter)
అంతర్జాతీయం

Asim Munir – Trump: ఆసీం మునీర్‌కు అగ్నిపరీక్ష.. పాకిస్థాన్‌ తర్జన భర్జన.. ట్రంప్ భలే ఇరికించారే!

Asim Munir – Trump: పాకిస్థాన్ ఫీల్డ్ మార్షన్ (Field Marshal), అర్మీ చీఫ్ ఆసీం మునీర్ (Asim Munir) గతంలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గాజాకు పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేస్తుండటం ఆసీం మునీర్ తో పాటు పాకిస్థాన్ ను సైతం చిక్కుల్లో పడేసింది. గాజా (Gaza)లో శాంతి భద్రతల పునరుద్దరణ కోసం పాక్ సైన్యాన్ని పంపిస్తే దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆసీం మునీర్ పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సైన్యాన్ని పంపకుంటే ట్రంప్ అసంతృప్తి గురి కావాల్సి వస్తోందని భయపడుతున్నారు. ప్రస్తుతం పాక్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది.

ట్రంప్‌తో ఆసీం మునీర్ భేటి

అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం.. త్వరలో ఆసీం మునీర్ అమెరికాకు వెళ్లి ట్రంప్ తో భేటి కానున్నారు. ఇది 6 నెలల వ్యవధిలో ట్రంప్ తో జరగనున్న మూడో సమావేశం. ఈ భేటిలో గాజాకు పాక్ సైన్యాన్ని పంపే విషయమై ఆసీం మునీర్ చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గాజా స్థిరీకరణకు ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల శాంతి ప్రణాళిక ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిన తర్వాత గాజా పునరుద్ధరణ కోసం పాక్ సహా ముస్లిం దేశాలు సాయం చేయాలి. ఆయా దేశాల సైన్యం గాజాలో తాత్కాలిక భద్రతా బాధ్యతలు చేపట్టాలి. కాగా ఇజ్రాయెల్ – హమాస్ మధ్య గత రెండేళ్లుగా సాగిన యుద్ధంలో గాజా నగరం తీవ్రంగా ధ్వంసమైన సంగతి తెలిసిందే.

ప్రత్యక్ష యుద్ధంలో దిగినట్లే..

అయితే హమాస్ ను నిరాయుధీకరించే బాధ్యత కూడా పాక్ సహా ముస్లిం దేశాల సైన్యంపై పడే అవకాశముండటంతో ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి మిషన్ పై ఆయా దేశాల్లో సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఇది వారిని నేరుగా ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణలోకి లాగి తమ దేశాల్లోని ప్రో–పాలస్తీనా, యాంటీ–ఇజ్రాయెల్ ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ లోనూ ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశముందని ఆసీం మునీర్ తో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ప్రజా వ్యతిరేకతకు భయపడి ట్రంప్ నిర్ణయాన్ని దిక్కరిస్తే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని పాక్ అధినాయకత్వం ఆందోళన చెందుతోంది.

ట్రంప్‌ను ధిక్కరిస్తే సమస్యే..

‘గాజా స్థిరీకరణ దళానికి సైన్యం పంపకపోతే ట్రంప్ అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇది అమెరికా పెట్టుబడులు, భద్రతా సహాయం కోరుతున్న పాకిస్థాన్‌కు తీవ్ర ఇబ్బందిగా మారొచ్చు’ అని వాషింగ్టన్‌లోని అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన మైకేల్ కుగెల్‌మాన్ తెలిపారు. అయితే ప్రపంచంలోని ముస్లిం దేశాల్లో అణ్వాయుధాలు కలిగిన ఏకైక దేశం పాకిస్థాన్ మాత్రమే. అనేకసార్లు పొరుగుదేశాలతో యుద్ధాలు చేసిన అనుభవజ్ఞులైన సైన్యం పాకిస్థాన్ కు ఉంది. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ ఇస్లామిస్ట్ ఉగ్రవాదులతోనూ పాక్ సైన్యం పోరాడుతోంది. ఈ కారణం చేతనే గాజాలో శాంతి పునరుద్ధరణకు సైనిక బలం అందించాలని ఆసీం మునీర్ పై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఆసీం మునీర్‌కు అగ్నిపరీక్ష

ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆసీం మునీర్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఏ దేశ సైన్యాధిపతికి సాధ్యం కానీ విధంగా నేరుగా ట్రంప్ ను కలిసి ఆయనతో వ్యక్తిగత చర్చలు సైతం జరిపారు. ఈ క్రమంలోనే ఈ నెల ప్రారంభంలో పాక్ రక్షణా దళాల అధిపతిగా ఆయన్ను నియమించారు. ఫీల్డ్ మార్షల్ గా ఆయన పదవి కాలాన్ని 2030 వరకూ పొడగించారు. అంతేకాదు నేర విచారణ నుంచి రక్షణ సైతం కల్పించారు. అయితే ఇదంతా ట్రంప్ తో ఆసీం మునీర్ కు ఉన్న సాన్నిహిత్యం వల్లే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలపై ఆసీం మునీర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గుతారా? దేశ ప్రజలను గౌరవిస్తారా? అన్న దానిపై ఆసీం మునీర్ స్టాండ్ ఏంటన్న చర్చ జరుగుతోంది.

Also Read: Telangana Govt: విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు.. మూడో డిస్కమ్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

పాక్ లో అంతర్గత కల్లోలం

ఒకవేళ అమెరికాకు మద్దతుగా నిలిచి గాజాలో పాకిస్థాన్ సైన్యాన్ని మోహరిస్తే ఆ దేశంలో అంతర్గత కల్లోలం తప్పదని సమాచారం. అమెరికా – ఇజ్రాయెల్ వ్యతిరేక ఇస్లామిస్ట్ పార్టీలు పాక్ లో మళ్లీ చెలరేగే ప్రమాదం ఉంది. ఆయా ఇస్లామిస్ట్ సంస్థలకు వేలాది మందిని ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఓ వర్గం తీవ్ర అసంతృప్తి తో ఉండటం.. పాక్ బలగాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజాకు సైన్యాన్ని పంపి కొత్త సమస్య సృష్టించుకుంటే పాకిస్థాన్ లో అంతర్గత కల్లోలం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిని పాకిస్థాన్ ఏ విధంగా డీల్ చేస్తుందో చూడాలి.

Also Read: Harish Rao: హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు? పార్టీలో సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి!

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్