Ramulu Suicide Case: గత కొన్ని నెలల క్రితం కేశపట్నం మండలంలో రాములు(Ramulu) అనే వ్యక్తి బలవన్మరణానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆర్థిక ఇబ్బందులు, మనస్తాపంతో రాములు ఆత్మహత్య చేసుకున్న ఈ కేసులో నిందితులుగా ఉన్న తణుకు ప్రకాష్(Prakash), లక్ష్మీనారాయణ(Lakshminarayana)లను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. రాములు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే రాములుకు డబ్బులు బాకీ ఉన్నారనే కారణంతో, నిందితులు ప్రకాష్, లక్ష్మీనారాయణ, ఇద్దరు కలిసి రాములు ఇంటికి వెళ్లి తలుపులకు తాళం వేశారు.
కేసు డీలే చేసిన ఎస్సై..
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు, ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లను మరియు సంఘటన వివరాలను ప్రస్తావిస్తూ ఓ సూసైడ్ నోట్ రాశారు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై రాములు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్(Suside Note)లో ఉన్న పేర్ల ఆధారంగా తణుకు ప్రకాష్, లక్ష్మీనారాయణలను నిందితులుగా గుర్తించారు. అయితే ఎస్.ఐ.పై కుటుంభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ ఆలస్యం అవుతుండటంతో రాములు కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఇటీవల కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం(Commissioner Ghaus Alam) ఐపీఎస్(IPS)ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.
Also Read: Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు
స్పందించిన సీపీ గౌస్ ఆలం
దీంతో స్పందించిన సీపీ గౌస్ ఆలం(CP Gauss Alam) స్తానిక పోలీస్ అధికారులను కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు తీరుపై సంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్, సంబంధిత ఎస్.ఐ.పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపాలని కఠినంగా ఆదేశించారు. సీ.పీ. ఆదేశాల మేరకు వెంటనే పోలీసులు చర్యలు చేపటారు. నిందితులైన తణుకు ప్రకాష్(Prakash) మరియు (Lakshiminarayana)లక్ష్మీనారాయణలను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. దీంతో బాధితులకు కొంతమేర న్యాయం లభించినట్లయింది.
Also Read: Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!
