Crime-News (Image source Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Crime News: భార్య తలపై రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. కారణం ఏమిటో తెలుసా?

Crime News: భర్త చేతిలో భార్య హత్య

రోకలి బండతో అతికిరాతకంగా మర్డర్
పోలీసుల ఎదుట నిందితుడి లొంగుబాటు

సూర్యాపేట క్రైమ్, స్వేచ్ఛ: కుటుంబ కలహాలు కారణంగా జరుగుతున్న నేరాలు రోజురోజుకు పెరిగిపోతూ, సమాజాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. చిన్నపాటి ఘర్షణలు, ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, మద్యం అలవాట్లు, బాధ్యతారాహిత్యం వంటి కారణాలతో చిన్న చిన్న వివాదాలు మొదలై, ఆ తర్వాత పెద్ద తగాదాలుగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడే ఉద్రిక్తతలు క్షణికావేశంలో హింసకు దారి తీస్తున్నాయి. చివరకు ప్రాణాలను తీసే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా, సూర్యాపేట జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది.

మోతే మండలం సిరికొండ గ్రామంలో భార్యను భర్త అత్యంత దారుణంగా (Crime News) రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. కారింగుల వెంకన్న గౌడ్- పద్మ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి వెంకన్నకు, భార్య పద్మకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో, క్షణికావేశంలో భార్య పద్మపై రోకలిబండతో దాడి చేసి వెంకన్న హతమార్చాడు. ఈ ఘటనతో సిరికొండ గ్రామం ఉలిక్కిపడింది. హత్య చేసిన అనంతరం వెంకన్న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన మోతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.

Read Also- The Girlfriend Collections: బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీ కొత్త రికార్డ్ .. ది గర్ల్‌ఫ్రెండ్ 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

నా భర్త జాడ చెప్పండి

బెట్టింగుల మాయలో కానిస్టేబుల్
లోన్ డబ్బుతో పరారైన వైనం
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బెట్టింగుల వ్యసనానికి లోనైన కానిస్టేబుల్ అప్పులపాలయ్యాడు. చేతికి అందిన చోటల్లా అప్పులు చేసి బెట్టింగ్ కట్టాడు. ఇటీవల బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ డబ్బు తీసుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. భర్త జాడ తెలియక ఆందోళన చెందిన కానిస్టేబుల్ భార్య మల్లేశ్వరి, మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెహ్మత్‌నగర్‌కు చెందిన రమేష్ టీఎస్‌ఎస్‌ఏపీలో కానిస్టేబుల్. 2018లో 1వ బెటాలియన్‌కు ఎంపికయ్యాడు. అతనికి ఐదేళ్ల క్రితం మల్లేశ్వరితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లలో ఆటలు ఆడడం రమేష్‌కు అలవాటుగా మారింది. దాంతో అతడి కుటుంబంలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి.

గత మూడు నెలలుగా కానిస్టేబుల్ రమేష్ బెట్టింగ్ యాప్‌ల వాడడం మానేసి కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం రుణ మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బ్యాంకు నుంచి పొందిన లోన్ డబ్బు కూడా బెట్టింగులలో పెట్టి పోగొట్టుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Read Also- Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?

Just In

01

Chain Snatching: ఎంతకు తెగించార్రా.. ఉదయాన్నే బరితెగించిన చైన్ స్నాచర్స్

Jagtial: జగిత్యాల జిల్లాలో దారుణం.. 7 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

Akhanda 2 Thaandavam: సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ వస్తోంది.. ఎప్పుడంటే?

Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?

Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!