The Girlfriend Collections: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ మరియు రోహిణి కీలక పాత్రల్లో నటించారు.
ఇక కథ గురించి మాట్లాడుకుంటే.. ఎంఏ విద్యార్థిని భూమా (రష్మిక మందన్న), విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ల ప్రేమ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. విక్రమ్ అనే అబ్బాయి తన జీవితంలో ఒంటరితనంతో బాధపడుతూ, ప్రేమ కోసం తపన పడుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో అతని జీవితంలోకి భూమా (రష్మిక) వస్తుంది. ఆమె అందం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం విక్రమ్ ను వెంటనే ఆకర్షిస్తాయి. వీరి మధ్య ప్రేమ మొదలవుతుంది… కానీ, ఆ ప్రేమ క్రమంగా ఆబ్సెషన్ గా మారుతుంది.
విక్రమ్ కు భూమాపై ఉండే పొసెసివ్ నేచర్, ఆమె ప్రతి అడుగు తన నియంత్రణలో ఉండాలన్న కోరిక వారి రిలేషన్‌ను క్రమంగా కొత్త చిక్కులను తెచ్చి పెడుతుంది. భూమా తన స్పేస్, స్వేచ్ఛను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే, విక్రమ్ మాత్రం ఆమెను “విడిచిపెట్టలేని” స్థితికి చేరుకుంటాడు. ఇలా పెరుగుతున్న టాక్సిక్ రిలేషన్ చివరికి ఇద్దరి జీవితాల్లో అనుకోని మలుపులు తీసుకుని, కథ ముందుకు వెళ్తుంది.
ఈ కథ చాలా మంది అమ్మాయిలకు కనెక్ట్ అవ్వడంతో పెద్ద హిట్ అయింది. కేవలం ఏడూ రోజుల్లోనే రూ.11.3 కోట్లు సాధించింది. ఇక లాంగ్ రన్ లో ఈ చిత్రం రూ. 15.50 కోట్లు కలెక్ట్ చేశాయి. పది రోజుల్లో ఎన్ని కలెక్ట్ చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..
బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ. 1.3 కోట్లు కలెక్ట్ చేసింది
బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు రూ. 2.4 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద మూడో రోజు రూ. 2.7 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద నాలుగోవ రోజు రూ. 1.15 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఐదో రోజు రూ. 1.3 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఆరో రోజు రూ. 1.3 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఏడో రోజు రూ. 1.15 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read: Kunamneni Sambasiva Rao: ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
మొదటి వారం రూ. 11.3 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఎనిమిదవ రోజు రూ. 1 కోటి కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద తొమ్మిదవ రోజు రూ. 1.6 కోట్లు కలెక్ట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద పదో రోజు రూ. 1.60 కోట్లు కలెక్టు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి
ఈ రోజు వరకు మొత్తం 10 రోజులకు కలెక్షన్స్ రూ. 15.50 కోట్లు కలెక్ట్ చేశాయి.
