Umar (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Delhi Blast Case: ఢిల్లీ పేలుడుకు పాల్పడ్డ మొహమ్మద్ ఉమర్ అకౌంట్‌లో ఎంత డబ్బు పడిందో గుర్తించిన అధికారులు

Delhi Blast Case: దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోట వద్ద గత సోమవారం శక్తివంతమైన పేలుడు సంభవించిన (Delhi Blast Case) విషయం తెలిసిందే. ఉగ్ర సంబంధాలు ఉన్న డాక్టర్ మొహమ్మద్ ఉమర్ నబీ (Mohammad Umar) హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు పదార్థాలు నింపుకొని, ఆత్మహుతికి పాల్పడ్డాడు. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఈ ఘటనపై దర్యాప్తు బృందాలు విచారణ జరుపుతున్నా కొద్దీ సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఉగ్రవాద సంబంధాలున్న డాక్టర్ల అకౌంట్లలోకి చట్టవిరుద్ధ మార్గాల ద్వారా నగదు జమ అయినట్టు గుర్తించారు. ఆత్మహుతికి పాల్పడ్డ ఉమర్ అకౌంట్‌లో రూ.20 లక్షలు పడ్డట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ డబ్బంతా చట్టవిరుద్ధమైన చెల్లింపుల విధానాల్లో అందుకున్నట్టు గుర్తించారు. దీంతో, ఈ లావాదేవీలపై విచారణ జరిపేందుకు పలువురు హవాలా డీలర్లను అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

కార్ పార్కింగ్ వద్ద ఎవర్నైనా కలిశాడా?

ఢిల్లీ పేలుడుకు ముందు మొహమ్మద్ ఉమర్ ఏమేం చేశాడో ఖచ్చితమైన క్రమాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు దృష్టిసారించాయి. కారు పేలడానికి ముందు, సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచిన ప్రాంతంపై ఫోకస్ చేశారు. ఆ పార్కింగ్ ప్రదేశంలోకి ప్రవేశించిన ప్రతి వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు రెడీ చేశారు. ఆ పార్కింగ్‌లోకి ప్రవేశించిన వాహనాలు, వ్యక్తులకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు, ఎర్రకోట మెట్రో స్టేషన్ లోపలి సీసీటీవీ ఫుటేజీలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పేలుడుకు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ ఫుటేజీలలో రికార్డ్ అయ్యాయి. కారు పార్క్ చేసి ఉన్నప్పుడు, అతడు ఎవరినైనా కలిశాడా?, మాట్లాడాడా? అని ధృవీకరించుకునేందుకు మొహమ్మద్ ఫొటోను డ్రైవర్లు, వాహన యజమానులకు కూడా అధికారులు చూపిస్తున్నారు.

Read Also- KCR: స్థానికంపై దృష్టి సారించండి.. గెలుపోటములు సహజం..కేటీఆర్‌ను అభినందించిన కేసీఆర్

కాగా, ఢిల్లీ పేలుడుకు మూడు రోజుల ముందు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలున్న డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 2900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్‌లతో సంబంధాలున్న ‘వైట్ కాలర్’ ఉగ్రవాద ముఠాను వెలికితీశారు. ఈ కేసులో భాగంగా కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ఈ పరిణామాలను గమనించిన మహమ్మద్ ఉమర్ మూడు రోజులపాటు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఎర్రకోట సమీపంలో భారీ పేలుడుతో ఆత్మహుతికి పాల్పడ్డాడు.

ఉమర్ 1989లో జమ్మూ కశ్మీర్‌లో పుట్టాడు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ ఉగ్రలింకులు ఏర్పరచుకున్నాడు. దీంతో, ఈ యూనివర్సిటీపైనా కూడా దర్యాప్తు జరుగుతోంది. మొహమ్మద్‌ ఉమర్‌తో పాటు, అల్ ఫలా యూనివర్సిటీతో సంబంధాలున్న మాజీ డాక్టర్లు ముజామ్మిల్ గనై, షాహీన్ సయీద్‌లను కూడా అరెస్టు చేశారు. ఈ కాలేజీలో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో, వర్సిటీపై యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్), నాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) దృష్టిసారించాయి.

Read Also- KCR: స్థానికంపై దృష్టి సారించండి.. గెలుపోటములు సహజం..కేటీఆర్‌ను అభినందించిన కేసీఆర్

Just In

01

Cyber Fraud Alert: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు

AV Ranganath: అక్రమ మార్కింగ్‌ల‌పై చ‌ర్యలు.. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే శిక్షలు

Mother of Satan: ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ఢిల్లీ పేలుడుకు వాడిన బాంబు ఇదే!.. అసలేంటీ టీఏటీపీ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ప్రభావం చూపని కూటమి.. టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చినా రాని డిపాజిట్

GHMC: రేపటి నుంచి కలెక్టరేట్ జీహెచ్ఎంసీలో ప్రజావాణి.. 25న కౌన్సిల్ సమావేశం!