Crime News: కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు, కూతురు గొంతు నులిమి చంపేందుకు సొంత తండ్రి ప్రయత్నించాడు. దీంతో చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందింది. కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో అక్కడి స్ధానికులు ఓక్కసారిగా షాక్ కి గురిచేసింది.
Also Read: Cyber Crime: ఓరి నాయనా ఐటీ కమిషనర్‌కే టోపి పెట్టిన సైబర్ నేరగాళ్లు..40 వేలు స్వాహ..!
పరారీలో తండ్రి మల్లేశం..
కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు, కూతురు గొంతు నులిమి చంపేందుకు తండ్రి ప్రయత్నం చేశాడు. తీవ్రంగా అస్వస్థత గురై చికిత్స పొందుతూ కూతురు అర్చన(Archana) మృతి చెందగా కొడుకు ఆశ్రిత్(Ashrith) పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట. గత ఏడు సంవత్సరాల నుంచి కరీంనగర్(Karimnagar) వావిలాల పల్లిలో కిరాయికి ఉంటూ మల్లేశం- పోచమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరి ఇద్దరు కూతుళ్లు మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు.
తల్లి పోచమ్మ పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. పిల్లలిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తండ్రి మల్లేశం పరారీలో ఉన్నాడనీ పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు!
