Crime News: పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్(Medchal) ఎస్ ఓ టి(SOT) పోలీసులు కొకైన్ పట్టుకున్నారు వివరాల్లోకెళ్తే బీహార్(Bihar) కి చెందిన చోటు కుమార్(Chitu Kumar) వృత్తిరీత్యా నారాయణగూడ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ కూలి పని చేస్తూ ఉండేవాడు. కర్ణాటక చెందిన నాగరాజ(Nagaraju) శ్రీధర్(Srideer) అంబర్పేట్ లోని డిడి కాలనీలో బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తూ ఎల్బీనగర లో నివాసం ఉండేవాడు. నాగరాజ్ శ్రీధర్ సూచనల మేరకు చోటు కుమార్ జార్ఖండ్ వెళ్ళి సందీప్(Sandeep) అనే వ్యక్తి వద్ద నుండి కోకైనాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తిరిగి వచ్చాడు.
అర్ధరాత్రి సుచిత్ర వద్ద..
తీసుకొచ్చిన కొకైన్ ను చోటు కుమార్ తన మిత్రుడు సుచిత్ర లో ఉండే మితిలేష్ కుమార్(Mithilesh Kumar) వద్దకు వచ్చి తీసుకెళ్లాలని శ్రీధర్ కు చెప్పాడు. అప్పటికే పక్క సమాచారంతో మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు బుధవారం అర్ధరాత్రి సుచిత్ర వద్ద ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4.5 గ్రాముల కొకెయిన్ ,ఒక యాక్టివా ,6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ దాదాపు 1,73 ,500 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Eko Streaming on Netflix: ఓటీటీలోకి వచ్చేసిన మళయాళం యాక్షన్ థ్రిల్లర్ ‘ఎకో’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో ఘటనలో గంజాయి పట్టివేత
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలో గంజాయి మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. పక్క సమాచారంతో ఐదుగురిని అదుపులోకి తీసుకొని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Pawan Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ ఫిక్స్..

