Pawan Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
pawan-kalyan-newyear-gift
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ ఫిక్స్..

Pawan Movie: కొత్త ఏడాది 2026లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఓజీ తర్వాత సినిమాలు చేయడు అనుకున్న పవన్ కళ్యాణ్ నుంచి మరో ప్రాజెక్ట్ రాబోతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కిక్, రేసుగుర్రం సినిమాలతో మంచి హిట్లు సాధించిన సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత రామ్ తాళ్లూరి తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘జోడించిన చేతులతో, నిండిన హృదయంతో.. మా కలల ప్రయాణం జైత్రరామ మూవీస్ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నంబర్ 1’గా ప్రారంభమవుతోంది. మన ప్రియతమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) గారి ప్రేమపూర్వక ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్‌కి పేరు పెట్టడం జరిగింది. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ కృతజ్ఞతతో.. గర్వంగాఉంది. మా డ్రీమ్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది’.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, తన స్టైలిష్ మేకింగ్, వినూత్నమైన టేకింగ్‌కు ప్రసిద్ధి చెందారు. 2005లో ‘అతనొక్కడే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే నందమూరి కళ్యాణ్ రామ్‌కు భారీ విజయాన్ని అందించిన ఆయన, ఆ తర్వాత రవితేజతో ‘కిక్’, అల్లు అర్జున్‌తో ‘రేసు గుర్రం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరారు. హీరోల బాడీ లాంగ్వేజ్‌ను సరికొత్తగా ఆవిష్కరించడం, హై-టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాలను రిచ్‌గా చూపించడం ఆయన ప్రత్యేకత. రామ్ చరణ్‌తో ‘ధ్రువ’ వంటి స్టైలిష్ థ్రిల్లర్‌ను, మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చారిత్రాత్మక భారీ చిత్రాన్ని రూపొందించి తన మేకింగ్ రేంజ్‌ను నిరూపించుకున్నారు. కథలోని ఎమోషన్స్‌ను యాక్షన్‌తో మేళవించి తెరపై మ్యాజిక్ చేయడంలో దిట్టగా గుర్తింపు పొందారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరి ఏం చేస్తారో చూడాలి మరి.

Read also-Eko Streaming on Netflix: ఓటీటీలోకి వచ్చేసిన మళయాళం యాక్షన్ థ్రిల్లర్ ‘ఎకో’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Just In

01

Urea Monitoring: తెలంగాణలో తొమ్మిది మంది స్పెషల్ అధికారుల తనిఖీలు.. ఇక ఆ సమస్యకు చెక్..!

Air India Pilot: ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు షాక్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో దొరికిపోయిన ఎయిర్ ఇండియా పైలట్..!

Shocking Incident: రూ.50 పందెం కోసం.. పెన్ను మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత చూస్తే..

Minor Irrigation Census: మైనర్ ఇరిగేషన్ పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. బోరు బావులకు మీటర్లు?

Anasuya Post: అదే నేను.. అలాగే ఉంటాను.. స్విమ్ సూట్‌లో అనసూయ అందాల విందు