Eko Streaming on Netflix: మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే మిస్టరీ థ్రిల్లర్లకు ఉన్న క్రేజే వేరు. ఆ కోవలోనే థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘ఎకో’ (Eko) సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించేందుకు వచ్చేసింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ‘ఎకో’ చిత్రం ఈ రోజు నుండే స్ట్రీమింగ్ ప్రారంభించింది. 2025లో మలయాళంలో విడుదలైన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, కేవలం ఐదు కోట్ల రూపాయల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
Read also-Dhurandhar Movie: అలా జరిగినందుకు రూ.90 కోట్ల వరకూ నష్టపోయిన ‘దురంధర్’ సినిమా.. ఎందుకంటే?
కథా నేపథ్యం
ఈ సినిమా కథ అంతా ‘కాట్టుకున్ను’ అనే మారుమూల అటవీ ప్రాంతంలో సాగుతుంది. ఐదేళ్లుగా కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి చుట్టూ ఈ మిస్టరీ తిరుగుతుంది. అతను ఒక డాగ్ బ్రీడర్ (కుక్కల పెంపకందారుడు) మాత్రమే కాదు, అనేక చీకటి రహస్యాలతో సంబంధం ఉన్న వ్యక్తి. అతని భార్య మ్లాతి (బియానా మోమిన్) పీయూస్ (సందీప్ ప్రదీప్) ఆ అడవిలో ఏకాంతంగా ఉంటూ కురియాచన్ కోసం ఎదురుచూస్తుంటారు. అడవిలోకి కొత్త వ్యక్తుల ప్రవేశంతో కురియాచన్ అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. కుక్కలు, మనుషుల మధ్య ఉండే వింతైన సంబంధాన్ని ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు.
Read also-iBomma Piracy: ఫ్రెండ్స్‌ను కూడా వదలని ఐబొమ్మ రవి.. వారి పేర్లతో ఫేక్ అకౌంట్లు.. కోట్లలో సంపాదన!
గతంలో ‘కిష్కింద కాండం’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు దింజిత్ అయ్యతన్, ఈ సినిమాను కూడా అంతే గ్రిప్పింగ్‌గా మలిచారు. బాహుల్ రమేష్ అందించిన కథనం ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుంది. యువ నటుడు సందీప్ ప్రదీప్ తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, బియానా మోమిన్ కీలక పాత్రలో మెప్పించారు. నరైన్ వినీత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముజీబ్ మజీద్ అందించిన నేపథ్య సంగీతం అడవిలోని నిశ్శబ్దాన్ని, భయాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసింది. మీరు రెగ్యులర్ మాస్ సినిమాల కంటే భిన్నమైన, లోతైన అర్థం ఉన్న థ్రిల్లర్లను ఇష్టపడితే ‘ఎకో’ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. మలయాళ ఒరిజినల్ మేకింగ్ స్టైల్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అడవి నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ డ్రామా మిమ్మల్ని చివరి వరకు ఆకట్టుకుంటుంది.

