Dhurandhar Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఇటీవల దాదాపు రూ. 1100 కోట్ల రూపాయలు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే మిడిల్ ఈస్ట్ దేశాల్లో విధించిన నిషేధం కారణంగా ఈ సినిమాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ చిత్రం సుమారు రూ. 90 కోట్ల మేర వసూళ్లను కోల్పోయిందని ఈ చిత్ర ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా వెల్లడించారు. అది కూడా వచ్చి ఉంటే మరో వంద కోట్లు సాధించేదని వారు అంటున్నారు.
Read also-Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాకిస్థాన్‌లోని ‘లాహోర్’ ప్రాంతంలో సాగే స్పై ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కింది. చిత్రంలో పాకిస్థాన్ వ్యతిరేక అంశాలు ఉన్నాయని భావించిన గల్ఫ్ దేశాలు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశాయి. యూఏఈ (UAE), సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్ వంటి ఆరు కీలక దేశాల్లో ‘ధురంధర్’ విడుదలకు అనుమతి లభించలేదు. దీంతో అక్కడి మార్కెట్ దాదాపు 90 కోట్ల రూపాయలు వరకూ నష్టపోయామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “మిడిల్ ఈస్ట్ మార్కెట్ భారతీయ యాక్షన్ సినిమాలకు చాలా పెద్దది. అక్కడ సినిమా విడుదల కాకపోవడం వల్ల సుమారు 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 90 కోట్లు) నష్టపోయాము. ఒకవేళ అక్కడ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే వసూళ్లు ఇంకా భారీగా ఉండేవి” అని పేర్కొన్నారు. అయితే ఆయా దేశాల నిబంధనలను తాము గౌరవిస్తామని ఆయన తెలిపారు.
Read also-Nayanthara Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి నయనతార లుక్ వచ్చేసింది.. ఏలా కనిపిస్తుందంటే?
ఈ నిషేధం ఉన్నప్పటికీ, ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్ల మార్కును దాటేసింది. గల్ఫ్ దేశాలు లేకపోయినా, ఉత్తర అమెరికా (North America), యూరప్ దేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అమెరికాలో కొన్ని రికార్డుల విషయంలో ‘బాహుబలి 2’ను కూడా ఈ చిత్రం వెనక్కి నెట్టడం విశేషం. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా మరియు అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించారు. భారతీయ గూఢచారి వ్యవస్థ (RAW) పాకిస్థాన్‌లో నిర్వహించే అత్యంత రహస్య ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గతంలో కూడా ‘ఫైటర్’, ‘టైగర్ 3’, ‘ఆర్టికల్ 370’ వంటి సినిమాలు ఇదే తరహాలో గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురయ్యాయి. అయినప్పటికీ, కంటెంట్ బలంగా ఉండటంతో ‘ధురంధర్’ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

