Smartphones Under rs 30000 (Image Source: Freepic)
బిజినెస్

Smartphones Under rs 30000: రూ.30 వేలలో టాప్ కెమెరా ఫోన్లు.. ఐఫోన్ రేంజ్ క్వాలిటీ.. ఫొటోలు, ఇన్‌స్టా రీల్స్‌కు బెస్ట్ ఛాయిస్!

Smartphones Under rs 30000: సాధారణంగా కొత్త ఫోన్ కొనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొందరు గేమ్స్ కు సపోర్ట్ చేసే మెుబైల్ కోరుకుంటే మరికొందరు ఫోన్ ప్రొసెసర్ కు ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే అందరూ కలిసి ప్రధానంగా కోరుకునే అత్యుత్తమ ఫీచర్ ఏదైనా ఉందంటే అది కెమెరానే. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో క్లాలిటీ ఫొటోలు దిగేందుకు, రీల్స్ చేసుకునేందుకు యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం బెస్ట్ కెమెరా ఫోన్ల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.30వేల బడ్జెట్ లో ఉన్న టాప్ కెమెరా ఫోన్లను ఈ కథనంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాటిలో మీ అంచనాలకు దగ్గరగా ఫోన్ ను ట్రై చేయండి.

ఐకూ నియో 10ఆర్ (iQOO Neo 10R)

ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్ ను కలిగి ఉంది. ముందు వైపు 32MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 (Snapdragon 8s Gen 3) చిప్‌సెట్‌తో ఇది వర్క్ చేస్తుంది. 6,400mAh బిగ్ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇది రూపొందింది. లాంగ్ లైఫ్ లో మంచి కెమెరా ఫోన్ కావాలని భావించేవారికి ఈ ఫోన్ మంచి ఛాయిస్. అమెజాన్ లో ఈ ఫోన్ రూ.24,998 అందుబాటులో ఉంది.

మోటో ఎడ్జ్ 60 ప్రో 5జీ (Moto Edge 60 Pro 5G)

ఈ మోటో ఫోన్ అత్యుత్తమ కెమెరాలను కలిగి ఉంది. వెనుక భాగంలో 50MP (OIS), 50MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 8350 Extreme చిప్‌సెట్‌పై వర్క్ చేస్తుంది. ఫోటోలు, వీడియోలు రెండింటికీ బలమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది.

నథింగ్ ఫోన్ 3ఎ ప్రో (Nothing Phone 3a Pro)

ఫోటోగ్రఫీ కోసం ఇది అద్భుతమైన ఆప్షన్. Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌తో వర్క్ చేస్తుంది. 50MP ప్రైమరీ, 50MP 3x టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ను వెనుక భాగంలో కలిగి ఉంది. 50MP ఫ్రంట్ కెమెరా ఉండటం వల్ల సెల్ఫీలు, ల్యాండ్‌స్కేప్‌ షాట్లు రెండూ అద్భుతంగా వస్తాయి. దీని ధర రూ. 26,350.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 (OnePlus Nord CE 5)

ఈ వన్ ప్లస్ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో మార్కెట్ లోకి వచ్చింది. స్పష్టమైన, స్టేబుల్ గా ఉన్న ఫొటోలు తీసుకునేందుకు ఇది ఉత్తమమైన ఛాయిస్. MediaTek Dimensity 8350 Apex చిప్‌తో ఇది పనిచేస్తుంది. 6.77 అంగుళాల AMOLED స్క్రీన్ తో ఇది రూపొందింది. ఈ ఫోన్ అమెజాన్ లో రూ. 24,998కు లభిస్తోంది.

ఒప్పో ఎఫ్ 31 ప్రో 5జీ (Oppo F31 Pro 5G)

ఇది 50 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో మార్కెట్ లోకి వచ్చింది. MediaTek Dimensity 7300 Energy చిప్‌సెట్‌తో వర్క్ చేస్తుంది. ఈ ఫోన్ లో దిగిన ఫొటోలు.. చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రతీ మైనర్ డిటైయిల్ కూడా ఈ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది. దీని ధర రూ.30,999. అమెజాన్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.

వివో టీ4 ప్రో (Vivo T4 Pro)

ఈ వివో ఫోన్.. Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. ముందువైపు 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో సెల్ఫీ ఫొటోలు చాలా సహజ సిద్దంగా వస్తాయని వినియోగదారులు చెబుతున్నారు. ఈ ఫోన్ రూ. 27,999 పొందవచ్చు.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే.. ముస్లింల సపోర్ట్ కాంగ్రెస్‌కే.. మంత్రి అజారుద్దీన్

ఏది కొనాలి?

ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు అత్యాధునిక కెమెరా పనితనం కోరుకునేవారికి Nothing Phone 3a Pro ఉత్తమ ఎంపిక. రోజువారీగా ఫొటోలు దిగడం, పవర్ ఫుల్ యూసేజ్ ను కోరుకునేవారు Vivo T4 Pro, OnePlus Nord CE 5 మంచి ఆప్షన్స్ గా చెప్పవచ్చు.

Also Read: Rahul Gandhi – H Files: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ.. ప్రతీ 8 మందికి ఒక నకిలీ ఓటర్.. హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్

Just In

01

Revolver Warning: భూపాలపల్లి జిల్లాలో గన్నుతో బీజేపీ నేత హల్ చల్.. కేసు వాదిస్తే చంపుతా అని బెదిరింపు

Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ కౌంటర్!

Generational Divide: ఆట మైదానంలో తండ్రుల ఆటలు.. మొబైల్ ఫోన్లలో కొడుకులు..!

GHMC: బాగు చేస్తే మేలులెన్నో.. అమలుకు నోచుకోని స్టాండింగ్ కమిటీ తీర్మానం

Crime News: గుట్టు చప్పుడు కాకుండా గంజాయి పెడ్లర్లు కొత్త ఎత్తులు.. పట్టుకున్న పోలీసులు