Palakurthi temple ( imgae credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Palakurthi temple: పాలకుర్తిలో అఖండజ్యోతి దర్శనం.. సోమేశ్వరాలయంలో హరిహరుల మహిమాన్విత క్షీరగిరి క్షేత్రం!

Palakurthi temple: కార్తీక పౌర్ణమి సందర్భంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అఖండజ్యోతి వెలిగించనున్నారు. శివ–కేశవులు స్వయంభూవులుగా వెలసిన ఈ క్షీరగిరి క్షేత్రంలో ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి నాడు జరిగే జ్యోతిర్లింగ దర్శనం భక్తుల మనసులను పరవశింపజేస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే,శివస్య హృదయం విష్ణువు – విష్ణోశ్చ హృదయం శివః అనే శ్లోకార్థాన్ని ప్రతిబింబించే ఆలయమిది.

Also  Read: Ganesh Visarjan 2025: బాలాపూర్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పై స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే..?

ఈ పవిత్ర స్థలం

శివుడు, విష్ణువు ఇద్దరూ ఏకరూపులని, హరిహరులై ఏకత్వాన్ని చాటిచెప్పే ఈ పవిత్ర స్థలం భక్తుల భక్తిని పెంపొందిస్తోంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర మాసంగా భావిస్తారు. సోమేశ్వరుడిగా శివుడు, లక్ష్మీనరసింహస్వామిగా మహావిష్ణువు ఒకే స్థలంలో కొలువై ఉన్న ఏకైక క్షేత్రం కావడంతో ఈ ఆలయానికి విశిష్టత ఏర్పడింది. దక్షిణ భారతదేశంలో కేరళలోని శబరిమలై, తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వరాలయాల తర్వాత, పాలకుర్తి సోమేశ్వరాలయంలో వెలిగించే అఖండజ్యోతి మూడవదిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం, అఖండజ్యోతికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి నాడు అఖండజ్యోతి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

Also  Read: Kasibugga Temple Tragedy: ప్రైవేటు ఆలయం అంటే ఏమిటి?, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వానికి సంబంధం లేదా?

Just In

01

Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్

MD Ashok Reddy: త్వరలో వాటర్ ఆడిట్.. ప్రతి చుక్క నీటిని లెక్కకడతాం: ఎండీ అశోక్ రెడ్డి

Directors early careers: సినిమాల్లోకి రాక ముందు ఈ దర్శకులు ఏం చేసేవారో తెలుసా..

Shiva 4K re-release: నాగార్జున చేసిన పనికి ఫిదా అయిన ఫ్యాన్స్.. ఏం చేశారంటే?

Rahul Gandhi – H Files: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ.. ప్రతీ 8 మందికి ఒక నకిలీ ఓటర్.. హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్