Ganesh Visarjan 2025: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహాల ఫైనల్ నిమజ్జనానికి కౌంట్ డౌన్ మొదలైంది. గత నెల 27వ తేదీ ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు మూడు, అయిదు, ఏడు, తొమ్మిది రోజుల్లో ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారు లక్షా 25 వేల విగ్రహాలు నిమగ్నం కాగా, ఈ నెల 6న జరగనున్న ఫైనల్ నిమజ్జనం రోజున మరో 50 వేల విగ్రహాలతో పాటు సిటీలో పేరుగాంచిన ఖైరతాబాద్(Khairathabad), బాలాపూర్(Balapur) గణనాధుల నిమజ్జనాల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణపయ్యను భక్తులు దర్శించుకునే ప్రక్రియను గురువారం రాత్రి నుంచే నిలిపేశారు. ఈ వినాయకుడి నిమజ్జనం కోసం విజయవాడ నుంచి భారీ టస్కర్ వాహానాన్ని రప్పించారు. వినాయకుడు టస్కర్ పై పెట్టి తీసుకువెళ్లేలా టస్కర్ కు వెల్డింగ్ పనులను కూడా చేపట్టారు.
ఖైరతాబాద్ గణపయ్యను
ఇక బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల పొడువున ఉన్న శోభయాత్రకు పోలీసులు, జీహెచ్ఎంసీ(GHMC), జలమండలితో పాటు వివిధ విభాగాల అధికారులు ఇప్పటికే పలు సార్లు నేరుగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో బాలాపూర్ వినాయకుడ్ని మధ్యాహ్నాం ఒంటి గంట కన్నా ముందు చార్మినార్ దాటించాలని, అలాగే గత సంవత్సరం మాధిరిగానే ఈ సారి కూడా ఖైరతాబాద్ గణపయ్యను మధ్యాహ్నాం ఒంటి గంట కల్లా ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం చేసేందుకు వీలుగా గురువారం రాత్రి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. బాలాపూర్, ఖైరతాబాద్ గణనాధుల నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తయితే, దాదాపు సిటీలో నిమజ్జనం ప్రక్రియ శాంతియుతంగా ముగిసినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఏకంగా 30 వేల మంది పోలీసులు బంధోస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఇక నిమజ్జన కార్యక్రమంలో పరిశుభ్రతకు, స్వచ్ఛతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన జీహెచ్ఎంసీ(GHMC) 303 కిలోమీటర్ల వివిధ రూట్లలో 14 వేల 475 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంచనున్నారు.
జీహెచ్ఎంసీ కృత్రిమ కొలనులు
గణేష్ ప్రతిమల నిమజ్జన కార్యక్రమం సురక్షితం, సాఫీగా, వేగంగా జరిగేలా చూసేందుకు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలో 74 కృత్రిమ నిమజ్జన కొలనులను ఏర్పాటు చేసింది. వీటిల్లో చిన్న చిన్న విగ్రహాలతో పాటు ఈ సారి ఎనిమిది అడుగుల ఎత్తున్న విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ప్రతి నిమజ్జన పాండ్ వద్ద ఒక ఇంచార్జ్ అధికారి, సర్కిల్ కు నోడల్ అధికారి తో పాటు ఓవరాల్ ఇంచార్జ్ గా సంబంధిత డిప్యూటీ కమిషనర్, శానిటేషన్ సిబ్బంది సరిపోను క్రేన్లు, కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపు, ఎప్పటి కప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు శానిటేషన్ సిబ్బంది తో పాటుగా వాహనాలను ఏర్పాటు చేసి సాఫీగా నిమజ్జనం జరిగేలా సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పని చేసేలా కార్మికులను నియమించారు. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడిఎల్ చెరువు, సఫిల్‌గూడ చెరువు, సున్నం చెరువు సహా 20 ప్రధాన చెరువులతో పాటు ఈ 74 కృత్రిమ కుంటలలో నిమజ్జనం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా ప్రధాన చెరువుల పై ఒత్తిడి తగ్గించడం, ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయడమే గాక, సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కు ప్రజల సౌకర్యం కోసం విసృతంగా కృత్రిమ నిమజ్జన పాండ్ లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది.
Also Read: Shri Ganesh temple: దేశంలోనే వింతైన ఆలయం.. గొడుగుల్లో ప్రసాదం.. భలే వెరైటీగా ఉందే!