Shri Ganesh temple (Image Source: Twitter)
Viral

Shri Ganesh temple: దేశంలోనే వింతైన ఆలయం.. గొడుగుల్లో ప్రసాదం.. భలే వెరైటీగా ఉందే!

Shri Ganesh temple: గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. వినాయక చవితి నవరాత్రులను మరాఠీలు ఏంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఊరూరా వినాయకుడి మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అటు గణనాథుడి ఆలయాలు సైతం గణేష్ ఉత్సవాల సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే మహారాష్ట్రలోని గణేష్ ఆలయాలు, మండపాలు ఒక ఎత్తు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం మరో ఎత్తు. ఎందుకంటే ఇక్కడ ప్రసాదం పంపిణీ చేసే విధానం దేశంలో అన్ని ఆలయాలతో పోలిస్తే చాలా విభిన్నం. ఇక్కడ ఆలయంలో ప్రసాదం తీసుకోవాలంటే గొడుగు తప్పనిసరి. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆచారం ఎలా వచ్చింది? ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం.

100 ఏళ్ల చరిత్ర..
బీడ్ జిల్లాలోని శ్రీ గణేశ దేవాలయంలో.. శతాబ్దానికి పైగా ఈ ఆచారం అమల్లో ఉంది. ఇక్కడ ప్రసాదం చేతితో ఇవ్వకుండా ఇళ్ల పైకప్పులపై నుంచి వర్షంలా కురిపిస్తారు. భక్తులు తమ గొడుగులను తలకిందులుగా పట్టుకొని ఆ ప్రసాదాన్ని అందుకుంటారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం గౌరీ పూజ సందర్భంగా జరుగుతుంది. ఆలయంలో పూజలు పూర్తయ్యాక పెద్ద మొత్తంలో ప్రసాదం తయారు చేసి భక్తులపై ఇంటి పైకప్పుల నుంచి విసురుతారు. వందలాది మంది భక్తులు అక్కడికి చేరి తమ గొడుగులను తలకిందులుగా పట్టుకుని పవిత్రమైన ఆ ప్రసాదాన్ని అందుకుంటారు.

Also Read: Rappa Rappa Video: వినాయకుడిపై రప్పా రప్పా రాతలు.. ఎరుపు రంగుతో.. గొడ్డలి గుర్తువేసి ఊరేగింపు

ఈ ఆచారం ఎలా వచ్చిందంటే?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆచారం మొదట్లో గొడుగులతో సంబంధం లేకుండా ఉండేది. అప్పట్లో భక్తులు తమ పాగాలు లేదా ధోతీల్లోనే ప్రసాదం తీసుకునేవారని పెద్దలు చెబుతున్నారు. కాలక్రమేణా గొడుగులను వాడడం మొదలైందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పద్దదే బీడ్ గణేశోత్సవంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారంగా మారిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు.. దీనిని వినూత్నమైన ఆచారంగానే కాకుండా తరతరాలుగా వస్తున్న వారసత్వానికి గుర్తుగా భావిస్తున్నారు. పైకప్పులపై నుంచి కురిసే ప్రసాదాన్ని గొడుగుల ద్వారా అందుకుంటే ఆ గణనాథుడి ఆశీస్సులు లభిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం.

Also Read: Villagers Steal Asphalt: వామ్మో ఇదేం దొంగతనంరా స్వామి.. ఏకంగా కొత్త రోడ్డునే లేపేశారు?

గణేశ చతుర్థి 2025
ఇదిలా ఉంటే గణేశ చతుర్థి ఆగస్టు 27 బుధవారం ప్రారంభమైంది. భాద్రపద శుక్ల చతుర్థి రోజున దేశమంతటా ఉత్సాహంగా వేడుకలు మొదలయ్యాయి. ఈ 9 రోజుల పాటు సాగే ఈ మహోత్సవం సెప్టెంబర్ 6 శనివారం రోజున జరిగే నిమజ్జనం ప్రక్రియతో ముగుస్తుంది. ఆ రోజు దేశమంతా శోభాయాత్రలు, గణపతి బప్పా మోరియా నినాదాలు, భక్తి నిండిన ప్రార్థనలతో మార్మోగిపోతుంది.

Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం