Rappa Rappa Video (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Rappa Rappa Video: వినాయకుడిపై రప్పా రప్పా రాతలు.. ఎరుపు రంగుతో.. గొడ్డలి గుర్తువేసి ఊరేగింపు

Rappa Rappa Video: ‘పుష్పా 2’ లోని రప్పా రప్పా డైలాగ్ ఇటీవల ఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ఒక్కొక్కడి తల రప్పా రప్పా నరుకుతా” (ఒక్కొక్కడి తల తీసేస్తాను) అని అల్లు అర్జున్ అంటాడు. అయితే ఇదే డైలాగ్ ను ఈ ఏడాది జూన్ లో జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఉపయోగించడం వివాదస్పదమైంది. ఇది అధికార, విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలకు దాడి చేసింది. అయితే తాజాగా మరోమారు రప్పా రప్పా డైలాగ్ ఏపీలో దుమారం రేపింది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో జరిగిన వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో ఈ రాతలు కనిపించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే..
వైఎస్సార్ కడప జిల్లా పెద్దనపాడులో ఓ వినాయకుడి ప్రతిమపై రప్పా రప్పా అనే రాతలు రాసి కనిపించాయి. ఈసారి ఫ్లకార్డులు కాకుండా ఏకంగా వినాయకుడి విగ్రహం వెనుకవైపున రప్పా రప్పా అని రాయడం వివాదానికి కారణమైంది. ఎరుపు రంగుతో రాయడంతో పాటు గొడ్డలి గుర్తు సైతం వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో మరోమారు రప్పా రప్పా డైలాగ్ ఏపీలో తీవ్ర చర్చకు తావిచ్చింది.

టీడీపీ ఫైర్..
జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఈసారి రప్పా రప్పా డైలాగ్ కనిపించడంతో టీడీపీ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యింది. ఏమిటీ ఉన్మాద చేష్టలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రామతీర్ధంలో రాముల వారి తల నరికించినట్టు, మీ బూతులు నాని నరికింది హనుమంతుడి చేయే కదా అన్నట్టు, ఇప్పుడు నీ పిల్ల సైకోల చేత, వినాయకుడుని నిమజ్జనం చేయకుండా రప్పా రప్పా గొడ్డలి వేటు వేస్తావా ఏంటి? బాబాయ్ ని ఎలాగూ వదల్లేదు, కనీసం దేవుళ్ళని అయినా వదిలేయి జగన్..’ జగన్ అంటూ టీడీపీ రాసుకొచ్చింది.

వివాదం మొదలైన ఘటన
ఈ ఏడాది జూన్ 19న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ అభిమాని (రవితేజ) ఫ్లెక్సీ బ్యానర్ పట్టుకుని నిలబడ్డాడు. ఆ బ్యానర్‌లో ‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల తలలు గంగమ్మ జాతరలో పొటెళ్ల తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం’ అని రాశారు. ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో.. ఫ్లెక్సీ పట్టుకున్న యువకుడ్ని పల్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

జగన్, చంద్రబాబు మాటల యుద్దం
యువకుడి అరెస్ట్ అనంతరం.. ఓ ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడుతూ రప్పా రప్పా డైలాగ్ ను ప్రస్తావించారు. ‘ఇది సినిమా డైలాగ్ కదా? పుష్పా 2లోది కదా? సినిమాలో వస్తుంటే ఫ్లెక్స్‌లో రాయకూడదా? డెమాక్రసీలో ఇది తప్పా?’ అంటూ పరోక్షంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘సినిమాలో డైలాగ్ అని ఫ్లెక్స్‌లో పెట్టి బెదిరించడం సరైనదేనా? సినిమాలో మరణాలు, రేప్ సీన్స్ ఉంటే బయట కూడా అలాగే చేస్తారా? ఇది క్రిమినల్ మైండ్‌సెట్’ అని విమర్శించాడు. జగన్ మైండ్‌సెట్‌ వయలెన్స్‌ను ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: CM Revanth Reddy: ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు.. నాటి కృషే నేటి ఫలితం

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం